Kapil Sibal : సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ లేనంత ఒత్తిడికి లోనవుతోంది. ఇప్పటికే ఐదు రాష్ట్రాలలో పరువు కోల్పోయి నానా తంటాలు పడుతోంది.
ఢిల్లీ వేదికగా జరిగిన సీడబ్ల్యూసీ మీటింగ్ హాట్ టాపిక్ గా మారింది. అనుకోని రీతిలో పవర్ లో ఉన్న పంజాబ్ ను కూడా పోగొట్టుకుంది. దీనికంతటికీ గాంధీ ఫ్యామిలీనే కారణమంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
దీంతో కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలుగా విడి పోయింది. ఒక వర్గం గాంధీ కుటుంబానికి మద్దతుగా నిలిస్తే ఇంకో వర్గం గాంధీ కుటుంబం పదవుల నుంచి తప్పు కోవాలని డిమాండ్ చేస్తోంది.
ఇప్పటికే జీ23 అసమ్మతి వర్గానికి నాయకత్వం వహిస్తున్న గులాం నబీ ఆజాద్ నివాసంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు సీనియర్ నాయకులు.
ఇందులో భాగంగానే ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, ప్రముఖ న్యాయవాది కపిల్ సిబాల్ (Kapil Sibal )సంచలన కామెంట్స్ చేశారు. ఆయన నేరుగా గాంధీ ఫ్యామిలీని టార్గెట్ చేశారు.
వెంటనే పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వాలని కోరారు. ఎవరూ కోరక ముందే స్వచ్చంధంగా తమ పదవుల నుంచి తప్పు కోవాలని సూచించారు.
లేకపోతే పార్టీ అడ్రస్ లేకుండా పోతుందని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ అంటే ఇంటి పార్టీ కాదని అది అందరి పార్టీ అని స్పష్టం చేశారు. దీంతో గాంధీ వర్గానికి చెందిన మాణిక్యం ఠాగూర్ సీరియస్ అయ్యారు. ఇలాంటి వ్యాఖ్యలు మంచిది కాదన్నారు.
Also Read : పొరపాటున పాక్ లో మిస్సైల్ కూలింది