Kapil Sibal Kiren Rijiju : ‘కిరెన్’ కామెంట్స్ ‘కపిల్’ సీరియస్
మోదీని మించి పోయాడంటూ కామెంట్
Kapil Sibal Kiren Rijiju : కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజుపై షాకింగ్ కామెంట్స్ చేశారు మాజీ కేంద్ర న్యాయ శాఖ మంత్రి , ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్. కేంద్రం, న్యాయ వ్యవస్థకు మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఇప్పటికే కిరెన్ రిజిజుతో పాటు ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఒకానొక సమయంలో కొలీజియం వ్యవస్థ పూర్తిగా తప్పుదారి పడుతోందనే అర్థం వచ్చేలా కీలక కామెంట్లు చేయడం చర్చకు దారి తీసేలా చేసింది. ఇదే సమయంలో ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఆర్ఎస్ సోధి ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడటం కలకలం రేపింది.
ఇక కొలీజియంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఒకరు ప్రతినిధి తప్పనిసరిగా ఉండాలని కోరుతూ భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి ధనంజయ వై చంద్ర చూడ్ కు లేఖ రాశారు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు.
దీనికి ఇంకా రిప్లై ఇవ్వలేదు సీజేఐ. ఈ క్రమంలో వరుసగా కేంద్రం వర్సెస్ సుప్రీంకోర్టు మధ్య మరింత దూరం పెరుగుతోంది. ఈ తరుణంలో కేంద్ర మంత్రి మరో సంచలన కామెంట్స్ చేశారు. న్యాయ వ్యవస్థను అణగదొక్కేందుకు మోదీ ప్రభుత్వం ఒక్క అడుగు ముందుకు వెయలేదంటూ చెప్పారు.
ఆయన చేసిన వ్యాఖ్యలపై సీరియస్ గా స్పందించారు కపిల్ సిబల్(Kapil Sibal). మోదీ లాగా కిరెన్ రిజిజు కూడా ఓ రత్నం అంటూ ఎద్దేవా చేశారు. మంగళవారం కపిల్ సిబల్ ట్విట్టర్ వేదికగా నిప్పులు చెరిగారు. ఇది పూర్తిగా న్యాయ వ్యవస్థపై పెత్తనం చెలాయించేందుకు చేస్తున్న ప్రయత్నం తప్ప మరొకటి కాదని పేర్కొన్నారు.
Also Read : కొలీజియంపై ఆర్ఎస్ సోధి కామెంట్స్