CM Bommai : త్వరలోనే కర్ణాటక మంత్రివర్గ విస్తరణ – సీఎం
వేచి చూడాలన్న సీఎం బస్వరాజ్ బొమ్మై
CM Bommai : కర్ణాటకలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ మరోసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తోంది. మరో వైపు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు(Bharat Jodo Yatra) ఎనలేని స్పందన లభించింది కన్నడ నాట. దీంతో రాష్ట్రంలో ప్రధాన పోటీ బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే ఉండబోతోంది.
ఇప్పటి నుంచే భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం కన్నడ ప్రాంతంపై ఫోకస్ పెట్టింది. ఈ తరుణంలో క్యాబినెట్ లో(Karnataka Cabinet) కొలువు తీరాలని ఆశించిన వాళ్లకు పదవులు దక్కక పోవడంతో మరికొందరికి ఛాన్స్ ఉంటుందనే సంకేతం పంపింది హైకమాండ్. మరో వైపు సౌమ్యుడిగా పేరొందిన బొమ్మైని మారుస్తారన్న ప్రచారం కూడా జరిగింది.
దీనికి పుల్ స్టాప్ పెట్టింది బీజేపీ. ఇప్పటికే పలుమార్లు రాష్ట్రంలో పర్యటించారు కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ షా. ఈ తరుణంలో శనివారం సంచలన ప్రకటన చేశారు సీఎం బొమ్మై(CM Bommai). క్యాబినెట్ కసరత్తుపై మరింత ఉత్కంఠను పెంచారు. కేబినెట్ లో ఎవరిని చేర్చుకోవాలనే దానిపై హైకమాండ్ తుది నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు.
తినబోతూ రుచులు అడగడం మంచిది కాదన్నారు ఆయన. నేను త్వరలోనే కేబినెట్ విస్తరణపై చర్చించేందుకు వెళ్లబోతున్నట్లు ప్రకటించారు. దీంతో ఆశావహులలో మరింత ఉత్కంఠ నెలకొంది. ఈ క్యాబినెట్ ను ప్రక్షాళన చేస్తారా లేక విస్తరిస్తారా అన్నది మాత్రం సీఎం చెప్పలేక పోయారు.
చిత్రదుర్గకుప్రాతినిధ్యం ఇవ్వక పోవడంపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీఎం బొమ్మై. రాజకీయ పరిస్థితుల కారణంగా చోటు కల్పించలేక పోయిందన్నారు.
Also Read : ప్రత్యేక నాగాలాండ్ డిమాండ్ తప్పు కాదు