Karnataka CM : దళిత సీఎం ఊపందుకున్న నినాదం
కర్ణాటకలో మళ్లీ మొదలైన పంచాయతీ
Karnataka CM : కర్ణాటక – రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ పార్టీలో దళిత సీఎం నినాదం ఊపందుకుంది. ఇప్పటికే సీఎం సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కు మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. పార్టీకి సంబంధించి కొందరు నేతలు డీకే వర్గంగా మరికొందరు సీఎం వర్గంగా చీలి పోయారు. తాజాగా కన్నడ నాట దళిత సామాజిక వర్గానికి చెందిన వారికి సీఎం పదవి కట్టబెట్టాలన్న నినాదం ఊపందుకుంది.
Karnataka CM Demand
సీఎం, డిప్యూటీ సీఎం మధ్య నెలకొన్న వర్గ పోరు కొత్త రూపు సంతరించుకుంది. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు బీకే హరి ప్రసాద్ కొత్త డిమాండ్ ను ముందుకు తీసుకు వచ్చారు. దళిత నాయకుడైన పరమేశ్వర్ కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని కోరారు. ఇదే విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తూ వస్తున్నారు.
ఇంకో వైపు డీకే శివకుమార్ ను తన వైపు చూడకుండా ఉండేందుకు సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah) పావులు కదుపుతూ వస్తున్నారు. ఆయన అనుంగు అనుచరుడిగా పేరు పొందిన సహకార శాఖ మంత్రి రాజన్న ఏకంగా మరో ముగ్గురిని డిప్యూటీ సీఎంలను నియమించాలని డిమాండ్ చేయడం కలకలం రేపింది.
ఇదిలా ఉండగా వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గనుక 20 సీట్లకు పైగా గెలిస్తే డీకే శివకుమార్ ఇక ఊరుకోడని సీఎం పోస్టు కావాలని డిమాండ్ చేస్తారని ఆయన మద్దతు దారులు బయటకు చెప్పడం విశేషం.
Also Read : Uttam Kumar Reddy : డిసెంబర్ 9న గడ్డం గీసుకుంటా