Anand Mamani : క‌ర్నాట‌క డిప్యూటీ స్పీక‌ర్ క‌న్నుమూత‌

తండ్రి చంద్ర‌శేఖ‌ర్ మామ‌ణి కూడా డిప్యూటీ స్పీక‌ర్

Anand Mamani : క‌ర్ణాట‌క భార‌తీయ జ‌న‌తా పార్టీలో విషాదం చోటు చేసుకుంది. ఆ పార్టీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు, డిప్యూటీ స్పీక‌ర్ ఆనంద్ మామ‌ణి క‌న్ను మూశారు. ఆయ‌నకు 56 ఏళ్లు. క‌ర్ణాట‌క‌లోని సౌద‌త్తి శాస‌న‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆయ‌న మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు.

నిన్న రాత్రి మృతి చెందారు. ఆయ‌న‌కు భార్య ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. రాష్ట్ర ముఖ్య‌మంత్రి బ‌స్వరాజ్ బొమ్మై తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు. ఆనంద్ మామ‌ణికి నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆనంద్ మామణి నిబ‌ద్ద‌త క‌లిగిన రాజ‌కీయ నాయ‌కుడు అని పేర్కొన్నారు.

ఆయ‌న‌ను కోల్పోవ‌డం పార్టీకి, రాష్ట్రానికి తీర‌ని న‌ష్ట‌మ‌ని వాపోయారు. ఆయ‌న తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురై ఆస్ప‌త్రిలో చేరారు. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఆనంద్ మామ‌ణి(Anand Mamani) ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని కోరారు రాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి బీఎస్ యెడియూర‌ప్ప‌.

ఆయ‌న కుటుంబానికి దేవుడు భ‌రోసా ఇవ్వాల‌ని ప్రార్థించారు. క‌ర్ణాట‌కకు చెందిన మంత్రులు, ప్ర‌జా ప్ర‌తినిధులు డిప్యూటీ స్పీక‌ర్ ఆనంద్ మామ‌ణి ఆక‌స్మిక మృతి ప‌ట్ల తీవ్ర సంతాపం వ్య‌క్తం చేశారు. ఓం శాంతి అంటూ ట్వీట్ చేశారు సీఎం బొమ్మై.

ఆనంద్ మామ‌ణి మృతితో తీవ్ర విషాదం అలుముకుంది క‌ర్ణాట‌క‌లో. భార‌తీయ జ‌న‌తా పార్టీ అధినాయ‌క‌త్వం, పార్టీ వ్య‌వ‌హారాల ఇన్ చార్జి కూడా తీవ్ర సంతాపం తెలిపారు.

ఇదిలా ఉండ‌గా 1990లో ఆనంద్ మామ‌ణి తండ్రి చంద్ర‌శేఖ‌ర్ మామ‌ణి కూడా క‌ర్ణాట‌క ప్ర‌భుత్వంలో డిప్యూటీ స్పీక‌ర్ గా ప‌ని చేశారు.

Also Read : సీఎం యోగికి స్వాతి మ‌లివాల్ లేఖ

Leave A Reply

Your Email Id will not be published!