Karnataka Govt : మత మార్పిడి నిరోధక చట్టం రద్దు
కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం
Karnataka Govt : సీఎం సిద్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గత బీజేపీ ప్రభుత్వం తీసుకు వచ్చిన మత మార్పిడి నిరోధక చట్టాన్నిరద్దు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు తీర్మానం చేసినట్లు ప్రకటించారు సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్.
మత మార్పిడి నిరోధక చట్టం పూర్తిగా డాక్టర్ బాబా సాహెబ్ రాసిన భారత రాజ్యాంగానికి వ్యతిరేకమని పేర్కొన్నారు. దీనిపై తమ మంత్రివర్గం విస్తృతంగా చర్చలు జరిపిందని, చివరకు రద్దు చేసేందుకు మొగ్గు చూపిందని స్పష్టం చేశారు సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah).
ఒక రకంగా కేంద్రంలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీకి ఇది ఇబ్బంది కలిగించే నిర్ణయం అని చెప్పక తప్పదు. త్వరలోనే పలు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తాము లౌకిక వాదానికి కట్టుబడి ఉన్నామని, అందరూ సమాజంలో భాగమని తాము నమ్ముతామని మరోసారి స్పష్టం చేశారు సీఎం. ఆయన చేసిన వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఇదిలా ఉండగా తాజాగా జరిగిన ఎన్నికల్లో ఊహించని రీతిలో బీజేపీకి షాక్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. 224 సీట్లకు గాను 135 సీట్లతో భారీ విజయాన్ని నమోదు చేసింది. అధికారంలోకి వచ్చిన వెంటనే కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఝలక్ ఇస్తోంది.
Also Read : AP CM YS Jagan : మూరుమూల పల్లెల్లో జియో సేవలు