Karnataka Maharashtra Row : కన్నడ..మరాఠా సరిహద్దు ఉద్రిక్తం
బెలగావి వద్ద భారీగా పోలీసుల మోహరింపు
Karnataka Maharashtra Row : కర్ణాటక, మహారాష్ట్రల మధ్య వివాదం తారా స్థాయికి చేరింది. కర్ణాటక లోని బెలగావి వద్ద ఇవాళ అసెంబ్లీ ప్రారంభమైంది. ఈ సందర్బంగా మహారాష్ట్రకు చెందిన ప్రతిపక్ష పార్టీలు శివసేన బాల్ ఠాక్రే, ఎన్సీపీ, కాంగ్రెస్ (ఎంవీఏ) పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కర్ణాటక సరిహద్దు వద్దకు చేరుకున్నారు.
కర్ణాటకలోకి ప్రవేశించేందుకు ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులను భారీగా మోహరించారు. తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వందలాది సరిహద్దు వద్దకు చేరుకున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం(Karnataka Maharashtra Row) కొన్నేళ్లుగా నడుస్తూ వస్తోంది. కేంద్ర హోం శాఖ మంత్రి ఈ మేరకు సీఎంలతో సమావేశానికి పిలిచారు.
కానీ ఇప్పటి వరకు కేంద్రం పరిష్కరించేందుకు ఫోకస్ పెట్టడం లేదంటూ శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ , కాంగ్రెస్ చీఫ్ ఆరోపించారు. ఇరు రాష్ట్రాలకు సంబంధించి కేసు సుప్రీంకోర్టులో నడుస్తోంది.
పలువురు నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటక అసెంబ్లీ 10 రోజుల పాటు కొనసాగనుంది. దీంతో ఆందోళనకారులు సరిహద్దు బెలగావిని దాటేందుకు ప్రయత్నం చేశారు. దీంతో ఎన్సీపీకి చెందిన హసన్ ముష్రిఫ్ , శివసేనకు చెందిన కొల్హాపూర్ చీఫ్ విజయ్ దేవనేను సోమవారం అదుపులోకి తీసుకున్నారు.
సరిహద్దు వద్ద మోహరించిన ఆందోళనకారులను వెనక్కి పంపించారు కర్ణాటక పోలీసులు. మరికొందరిని మహారాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మధ్యవర్తి మహారాష్ట్ర ఏకీకరణ సమితి కార్యకర్తలు ఇవాళ కర్ణాటక అసెంబ్లీని ముట్టడించేందుకు యత్నించారు.
ఇదిలా ఉండగా ఉక్రెయిన్, రష్యాపై ఉన్నంత ఫోకస్ మోదీకి రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదంపై లేదన్నారు శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్.
Also Read : కిసాన్ గర్జన భగ్గుమన్న రైతన్న