BC Nagesh : వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది కర్ణాటక రాష్ట్రం. నైతిక శాస్త్రం అనేది విద్యార్థులు తప్పక చదవాలని స్పష్టం చేశారు. ఇదే సమయంలో బైబిల్ వివాదం చోటు చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
విద్యా శాఖ మంత్రి బీసీ నగేష్ (BC Nagesh)సంచలన కామెంట్స్ కలకలం రేగాయి. స్కూల్ సిలబస్ లో భగవద్గీతను జోడిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పాటు క్లారెన్స్ హైస్కూల్ ఇటీవల విద్యార్థులను క్లాస్ రూంలోకి బైబిల్ తీసుకు రావాలని కోరారు.
దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు మంత్రి నగేశ్ . ఎట్టి పరిస్థితుల్లో భగవద్గీత, బైబిల్ ను కలప వద్దంటూ కోరారు. భగవద్గీత మత గ్రంథం కాదన్నారు. మతాచారాల గురించి ఇది మాట్లాడదని స్పష్టం చేశారు నగేష్. ప్రార్థనలు ఎలా చేయాలో చెప్పదన్నారు.
అన్ని మత గ్రంథాల కంటే భగవద్గీత గొప్పదన్నారు విద్యా శాఖ మంత్రి. ఇదే క్రమంలో విద్యార్థుల నైతిక స్థైర్యం పెంచేందుకు నైతిక శాస్త్రాన్ని సిలబస్ లో చేర్చేందుకు తాము సిద్దంగా ఉన్నామని విద్యా శాఖ మంత్రి.
ఇదిలా ఉండగా బెంగళూరుకు చెందిన క్లారెన్స్ హైస్కూల్ కు కర్ణాటక ప్రభుత్వం షోకాజ్ నోటీస్ ఆరీ చేసింది. ఈ తరుణంలో మంత్రి ఈ కామెంట్స్ చేశారు. ప్రైమరీ, సెకండరీ విద్యా విభాగం నోటీసులు జారీ చేయడం చర్చకు దారితీసింది.
ఇదిలా ఉండగా విద్యా శాఖ ఇచ్చిన నోటీసుకు వివరణ వచ్చాక క్లారెన్స్ హైస్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామన్నారు నగేష్ .ఇదిలా ఉండగా క్రైస్తవేతర విద్యార్థులను బైబిల్ చదవాలంటూ ఒత్తిడి చేస్తున్నారంటూ హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి.
Also Read : పద్మశ్రీ అవార్డు గ్రహీతకు అవమానం