Karnataka Mla Slap : ప్రిన్సిపాల్ పై ఎమ్మెల్యే దాడి కలకలం
సోషల్ మీడియాలో సెన్సేషన్
Karnataka Mla Slap : రోజు రోజుకు ప్రజా ప్రతినిధులు గాడి తప్పుతున్నారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన వాళ్లు గతి తప్పుతున్నారు. ఇందుకు తాజాగా కర్ణాటకలో చోటు చేసుకున్న ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ ఘటన జూన్ 20న చోటు చేసుకుంది. ప్రస్తుతం హల్ చల్ గా మారింది. ట్విట్టర్ లో ఎమ్మెల్యే అనుసరించిన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
కర్ణాటక లోని ఓ కాలేజీ ప్రిన్సిపాల్ పై దాడికి పాల్పడ్డారు జనతాదళ్ (సెక్యూలర్ ) నాయకుడు. చెంప చెళ్లుమనిపించారు(Karnataka Mla Slap). దీనిపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.
ఈ ఘటన కెమెరాకు చిక్కింది. ఈ ఘటన వెనుక ఉన్నది ఎవరో కాదు ఆయన ఓ ఎమ్మెల్యే కావడం విశేషం. కళాశాలను సందర్శించారు. ఇదే సమయంలో ల్యాబ్ ను పరిశీలించారు.
అభివృద్ధి పనుల గురించి ప్రిన్సిపాల్ స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడికి పాల్పడ్డారు. మండ్య ప్రాంతంలో చోటు చేసుకుంది ఈ ఘటన.
దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇది ప్రజల్లో ఆగ్రహావేశాలను కలుగ చేసింది. మాండ్యా నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు శ్రీనివాస్. నల్వాడి కృష్ణ రాజా వెడియార్ ఐటీఐ కాలేజీని సందర్శించారు.
ప్రిన్సిపాల్ ను పదే పదే కొట్టడం(Karnataka Mla Slap) కనిపించింది. ఒక మహిళతో సహా ఇతర అధికారులు అక్కడే ఉన్నారు. స్థానిక లీడర్లు చూస్తూ మౌనంగా ఉండి పోయారు.
ఇలాంటి ఎమ్మెల్యేను వెంటనే శాసనసభ నుంచి సస్పెండ్ చేయాలని పలువురు కోరుతున్నారు. నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : ఆధిపత్య పోరాటం ముదిరిన ముసలం
JanataDal MLA M Srinivas slaps the Principal of Nalwadi krishnaraja college in Karnataka in infront of everyone
This happens when power goes to head
Shame😈 pic.twitter.com/8RTCCud8Mo
— Sheetal Chopra 🇮🇳 (@SheetalPronamo) June 21, 2022