Shakti Scheme : ఉచిత ప్రయాణం ‘శక్తి’ ప్రారంభం
ప్రారంభించిన సిద్దరామయ్య, శివకుమార్
Shakti Scheme : కర్ణాటకలో ఇటీవలే కొలువు తీరిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తను ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. ఎన్నికల సందర్భంగా పార్టీ 5 హామీలను ప్రకటించింది. ఈ మేరకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది. తాము అధికారంలోకి వస్తే మహిళలు, బాలికలకు ఉచితంగా ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేసేందుకు అనుమతి ఇస్తామని ప్రకటించింది. ఇది ఐదు గ్యారెంటీ హామీలలో ఒకటిగా చేర్చింది ప్రభుత్వం.
ఉచిత హామీని నెరవేర్చేందుకు తాము కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah). ఆదివారం కర్ణాటకలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు, విద్యార్థులకు ప్రభుత్వ బస్సులలో ఉచితంగా ప్రయాణం కల్పించే శక్తి పథకాన్ని ప్రారంభించారు సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్.
ఈ సందర్బంగా మహిళా సాధికారత దిశగా ముందడుగు వేసిందన్నారు సీఎం. నేటి నుంచి మహిళలు, విద్యార్థులు ప్రభుత్వ బస్సుల్లో అవసరమైన పత్రాలు చూపించి ఉచితంగా ప్రయాణం చేయొచ్చని ప్రకటించారు. ఇచ్చిన హామీ మేరకు శక్తి యోజనను అమలు చేస్తున్నామని చెప్పారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్.
ఇచ్చిన హామీలను దశల వారీగా అమలు చేస్తామని, ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. ఎవరు ఎన్ని చెప్పినా వారి మాటలను నమ్మవద్దని కోరారు.
Also Read : MK Stalin : రూ.1,300 కోట్ల ప్రాజెక్టులకు సీఎం శ్రీకారం