Karthik Palani Vijay : తళపతికి కార్తీక్ పళని విషెస్
జోసెఫ్ విజయ్ ది 39వ బర్త్ డే
Karthik Palani Vijay : తమిళ సినీ నటుడు జోసెఫ్ విజయ్ పుట్టిన రోజు ఇవాళ. ఈ సందర్భంగా సినీ రంగానికి చెందిన ప్రముఖులు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ప్రముఖ సినీ ఫోటోగ్రాఫర్ , కెమెరా మెన్ కార్తీక్ పళని(Karthik Palani) విజయ్ ని పొగడ్తలతో ముంచెత్తాడు. మీ లాంటి దిగ్గజ నటులతో కలిసి పని చేయడం జీవితంలో మరిచి పోలేని సన్నివేశంగా గుర్తుండి పోతుందని పేర్కొన్నాడు. గురువారం ట్విట్టర్ వేదికగా స్పందించాడు పళని. అంతే కాదు భారీ ఎత్తున అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
విజయ్ పూర్తి పేరు జోషెఫ్ విజయ్ చంద్రశేఖర్. చెన్నైలో పుట్టారు. ఆయనకు 49 ఏళ్లు. తండ్రి ఎస్ . చంద్రశేఖర్, తల్లి శోభ. ఆయనను అభిమానులు అంతా తళపతి అని పిలుచుకుంటారు. తళపతి అంటే నాయకుడు అని. దక్షిణాదిన అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకునే నటుడిగా గుర్తింపు పొందారు విజయ్. ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో లియో సినిమాలో నటిస్తున్నాడు.
ఇదిలా ఉండగా విజయ్ బర్త్ డే సందర్భంగా మూవీ మేకర్స్ లియో ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ట్విట్టర్ లో ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక విజయ్ తన సినీ కెరీర్ లో ఇప్పటి వరకు 61 సినిమాలు చేశాడు. ప్రస్తుతం నటించిన లియో 62వ మూవీ. ఇక లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఇది రెండోది కావడం విశేషం. గతంలో మాస్టర్ తీశాడు.
Also Read : ASK Modi Protest : అమెరికాలో మోదీపై గుస్సా