Karti Chidambaram : కార్తీ చిదంబరంకు కోర్టు బిగ్ షాక్
ముందస్తు బెయిల్ తిరస్కరణ
Karti Chidambaram : చైనా వీసా స్కామ్ లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ కార్తీ చిదంబరం(Karti Chidambaram )కు కోలుకోలేని షాక్ తగిలింది. ఆయన తనను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది సీబీఐ ప్రత్యేక కోర్టు. ఇదిలా ఉండగా చైనా
వీసా స్కామ్ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ కేసు నమోదు చేసింది.
ఈ తరుణంలో ఆ కేసును ఆధారంగా చేసుకుని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. ఎంపీకి సమన్లు జారీ చేసింది. పనిలో పనిగా
ఎంపీ స్నేహితుడిని అరెస్ట్ చేసింది.
కార్తీ చిదంబరంను కొన్ని గంటల పాటు ఈడీ ప్రశ్నించింది. ఈ సందర్భంగా కార్తీ చిదంబరం(Karti Chidambaram) తనను ఎంపీ అని
చూడకుండా పార్లమెంట్ రూల్స్ కు విరుద్దంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు.
ఈ మేరకు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ కూడా రాశారు. అంతకు ముందు తనకు ముందస్తు బెయిల్ కావాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. చివరికి కోర్టు కూడా కీలక వ్యాఖ్యలు చేసింది.
ఎంపీ ఓ వైపు తాను తప్పు చేయలేదని అంటున్నారు. మరి ఎందుకు బెయిల్ కోరుతున్నారంటూ ప్రశ్నించింది. గత వారం వాదనలు విన్న
న్యాయ స్థానం తీర్పును రిజర్వ్ చేసింది.
2011 లో కార్తీ చిదంబరం తండ్రి పి. చిదంబరం కేంద్ర హోం శాఖ మంత్రిగా ఉన్న సమయంలో 263 మంది చైనా పౌరులకు వీసాలు మంజూరు
చేశారని ఆరోపణలు ఉన్నాయి.
కార్తీ చిదంబరం, తదితరులపై ఈడీ ఇటీవల మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. కాగా ఎంపీకి వ్యతిరేకంగా ఎలాంటి మెటీరియల్ లేదని న్యాయవాదులు వాదించారు. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ తీవ్ర అభ్యంతరం తెలిపారు.
Also Read : యుఎస్ నివేదికపై భారత్ సీరియస్