Karti Chidambaram : స్పీకర్ కు కార్తీ చిదంబరం లేఖ
సీబీఐ తీరు పూర్తిగా చట్ట విరుద్దం
Karti Chidambaram : చైనా వీసా స్కామ్ లో పాలు పంచుకున్నారనే ఆరోపణలపై తొమ్మిది గంటల పాటు విచారణ ఎదుర్కొన్నారు కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం తనయుడు ఎంపీ కార్తీ చిదంబరం. రెండో రోజు శుక్రవారం ఆయనకు సీబీఐ సమన్లు జారీ చేసింది.
దీనిపై తీవ్రంగా స్పందించారు కార్తీ చిదంబరం. ఇది పూర్తిగా చట్ట విరుద్దమని ఆయన పేర్కొన్నారు. ఆయనకు సంబంధించిన ఇళ్లపై, ఇతర ప్రాంతాలపై మూకుమ్మడిగా సీబీఐ దాడులు చేసింది.
ఈ సందర్బంగా పలు కీలక పత్రాలు కూడా స్వాధీనం చేసుకుంది. పనిలో పనిగా కార్తీ చిదంబరం (Karti Chidambaram) కు నమ్మకస్తుడిగా ఉన్న స్నేహితుడిని అరెస్ట్ చేసింది. క్విడ్ ప్రో పద్దతిన రూ. 50 లక్షలు చేతులు మారాయని సీబీఐ అభియోగాలు మోపింది కార్తీ చిదంబరంపై.
ఈ సందర్భంగా కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ తన పట్ల అనుసరిస్తున్న వైఖరిని తప్పు పట్టారు. పార్లమెంటేరియన్ గా తన అధికారాలు, హక్కులను సీబీఐ ఉల్లంఘించిందంటూ ఆరోపించారు.
ఈ మేరకు కార్తీ చిదంబరం(Karti Chidambaram) లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. ఇది పూర్తిగా తప్పు. ఏదైనా అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకోవాలి. లేదా ప్రశ్నించాలి. సీబీఐ అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చాను.
కానీ ఉద్ధేశ పూర్వకంగా నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తోందంటూ ఆరోపించారు లేఖలో. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన నా అత్యంత రహస్యమైన , సున్నితమైన వ్యక్తిగత నోట్లు, పేపర్లను స్వాధీనం చేసుకున్నారని వాపోయారు కార్తీ చిదంబరం.
Also Read : ప్లీజ్ మంత్రి పదవి నుంచి తప్పించండి