Kasani Jnaneshwar : టీడీపీకి కాసాని క‌టీఫ్

న‌మ్మించి మోసం చేసిన బాబు

Kasani Jnaneshwar : హైద‌రాబాద్ – తెలంగాణ తెలుగుదేశం పార్టీకి కోలుకోలేని షాక్ త‌గిలింది. ఇప్ప‌టికే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న టీడీపీ చీఫ్ నారా చంద్ర‌బాబు నాయుడుకు ఝ‌ల‌క్ ఇచ్చారు ఆ పార్టీకి చెందిన అధ్య‌క్షుడు కాసాని జ్ఞానేశ్వ‌ర్. ఉమ్మ‌డి ఏపీలో టీడీపీకి మంచి ప‌ట్టు ఉండేది. కానీ ఎప్పుడైతే రాష్ట్రం ఏర్పాటు అయ్యిందో ఆనాటి నుంచి ఆ పార్టీకి నేత‌లు లేకుండా పోయారు.

Kasani Jnaneshwar Serious Comments

తాజాగా చోటు చేసుకున్న రాజకీయ ప‌రిణామాల నేప‌థ్యంలో చంద్ర‌బాబు ఏరికోరి పార్టీకి పున‌ర్ వైభ‌వం తీసుకు వ‌చ్చేలా చేశారు. ఇందులో భాగంగా బ‌ల‌మైన సామాజిక వ‌ర్గం ముదిరాజ్ కులానికి చెందిన కాసాని జ్ఞానేశ్వ‌ర్ కు పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించారు.

తెలంగాణ‌లో త్వ‌ర‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. న‌వంబ‌ర్ 30న పోలింగ్, డిసెంబ‌ర్ 3న ఫ‌లితాలు రానున్నాయి. ఈ స‌మ‌యంలో టీడీపీ ఎన్నిక‌ల బ‌రిలో ఉంటుంద‌ని ఇప్ప‌టికే జ్ఞానేశ్వ‌ర్(Kasani Jnaneshwar) ప్ర‌క‌టించారు. తీరా చావు క‌బురు చ‌ల్ల‌గా చెప్పారు. పార్టీ పోటీ చేయ‌బోవ‌డం లేదంటూ ప్ర‌క‌టించ‌డంతో విస్తు పోయారు కాసాని.

ఆ వెంట‌నే సీరియ‌స్ కామెంట్స్ చేశారు. ఎవ‌రిని బ‌ద్నాం చేసేందుక‌ని ఈ నిర్ణ‌యం తీసుకున్నారంటూ మండిప‌డ్డారు. బాబుకు ఘాటుగా ప్రేమ లేఖ రాశారు. ఏపీలో జ‌న‌సేన‌తో క‌లిసి వెళ్లాల‌ని నిర్ణ‌యించ‌డం, తెలంగాణ‌లో కొంద‌రు నేత‌లు కాంగ్రెస్ కు స‌పోర్ట్ చేయాల‌ని చెప్ప‌డంపై మండిప‌డ్డారు కాసాని జ్ఞానేశ్వ‌ర్. దీంతో పార్టీకి రాజీనామా చేస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు.

Also Read : Chandrababu Naidu : బాబుకు మ‌ధ్యంత‌ర బెయిల్

Leave A Reply

Your Email Id will not be published!