Kasani Jnaneshwar : బాబుకు కాసాని ప్రేమ లేఖ
టీడీపీ అధినేతపై జ్ఞానేశ్వర్ ఫైర్
Kasani Jnaneshwar : హైదరాబాద్ – తెలంగాణ తెలుగుదేశం పార్టీ చీఫ్ కాసాని జ్ఞానేశ్వర్(Kasani Jnaneshwar) నిప్పులు చెరిగారు. నిన్నటి దాకా తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును పొగుడుతూ వచ్చిన ఆయన ఉన్నట్టుండి భగ్గుమన్నారు. ఆపై చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఘాటుగా లేఖ రాశారు. ప్రస్తుతం ఆయన రాసిన లేఖ కలకలం రేపుతోంది.
Kasani Jnaneshwar Written Letter to Babu
తెలంగాణలో ఇతర పార్టీలకు కొమ్ము కాసే విధంగా చంద్రబాబు ఎలా నిర్ణయం తీసుకుంటారంటూ ప్రశ్నించారు. దీనిని తాను పూర్తిగా వ్యతిరేకిస్తున్నానని స్పష్టం చేశారు. ఇప్పటికే స్కిల్ స్కాం కేసులో అడ్డంగా బుక్కై రాజమండ్రి జైలు ఊచలు లెక్క బెడుతున్న టీడీపీ చీఫ్ కు ఇది బిగ్ షాక్ .
పార్టీ ప్రెసిడెంట్ గా తనను సంప్రదించకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారంటూ నిలదీశారు. ఇదిలా ఉండగా కాసాని జ్ఞానేశ్వర్ కు హైదరాబాద్ లో, తెలంగాణలో మంచి పట్టుంది. ఆయన బలమైన ఓటు బ్యాంకు కలిగిన ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు.
దీంతో చంద్రబాబు నాయుడు తెలివిగా కాసానికి పార్టీ చీఫ్ పదవి కట్టబెట్టారు. ఓ వైపు కమ్మ ఇంకో వైపు ముదిరాజ్ కమ్యూనిటీలను ప్రాతిపదికగా తీసుకుని రాజకీయాలు చేయడంలో ఆరి తేరాడు చంద్రబాబు నాయుడు.
మొత్తంగా బాబును నమ్మకున్న పాపానికి కాసాని జ్ఞానేశ్వర్ కొంప మునిగేలా మారింది. దీనిపై ఇంకా లోకేష్ స్పందించ లేదు.
Also Read : Vishnu Vardhan Reddy : కాంగ్రెస్ పార్టీకి విష్ణు గుడ్ బై
