Kashmiri Pandit Shot Dead : కాశ్మీర్ పండిట్ కాల్చివేత
ఒకరు మృతి మరొకరికి తీవ్ర గాయాలు
Kashmiri Pandit Shot Dead : జమ్మూ కాశ్మీర్ లో టెర్రరిస్టుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. మొన్నటికి మొన్న ఆర్మీ క్యాంపుపై ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. తాజాగా జమ్మూ కాశ్మీర్ లోని ఆర్చర్డ్ లో కాశ్మీరీ పండిట్ సోదరులపై కాల్పులకు తెగబడ్డారు.
ఇద్దరు సోదరులపై కాల్పులు జరిపిరు ఉగ్రవాదులు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఘటన ప్రాంతాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి.
విస్తృతంగా సోదాలు చేపట్టాయి. పోషియాన్ లోని యాపిల్ తోటలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాశ్మీరీ పండిట్(Kashmiri Pandit Shot Dead) వర్గానికి చెందిన పౌరుడు మరణించినట్లు పోలీసులు గుర్తించారు.
గాయపడిన మరొకరిని ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. ఇద్దరూ హిందువులేనని తెలిపారు. ఇక ఉగ్ర దాడిలో బాధితుడిని సునీల్ కుమార్ గా గుర్తించారు.
అతడి సోదరుడు పింటూ కుమార్ ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం ఆక్రమిత కాశ్మీర్ లో కాశ్మీరీ పండిట్లు మైనార్టీలుగా ఉన్నారు. మోదీ ప్రభుత్వం వచ్చాక భద్రతను మరింత పెంచింది.
కానీ ఎక్కడికక్కడ దాడులకు పాల్పడుతున్నారు ఉగ్రవాదులు. వీరి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందన్నది బహిరంగ రహస్యమే. ఇదిలా ఉండగా ఆర్మీ క్యాంపుపై దాడికి పాల్పడిన అనంతరం బీహార్ కు చెందిన వలస కూలీని కాల్చి చంపారు టెర్రరిస్టులు.
రోజు రోజుకు జమ్మూ కాశ్మీర్ లో వీరి ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని వ్యతిరేకిస్తూ కాశ్మీరీ పండిట్లు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.
Also Read : చైనా నిఘా నౌక పై భారత్ ఆందోళన