Kata Sudha Srinivas Goud : కోట్లకు టికెట్ అమ్ముకున్నారు
కాటా సుధా శ్రీనివాస్ గౌడ్ కామెంట్స్
Kata Sudha Srinivas Goud : హైదరాబాద్ – తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు బహిరంగంగా సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా పటాన్ చెరువుకు చెందిన కాంగ్రెస్ నాయకురాలు కాటా శ్రీనివాస్ గౌడ్ సతీమణి కాటా సుధ నిప్పులు చెరిగారు.
Kata Sudha Srinivas Goud Comments Viral
ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ మూడు జాబితాలు ప్రకటించింది. ఇందులో 55 సీట్లను తొలి జాబితాలో కేటాయిస్తే, రెండో విడతలో 45 సీట్లను ఖరారు చేసింది. ఇక మూడో లిస్టును నిన్న ప్రకటించింది 16 మంది అభ్యర్థులతో. ఇందులో చివరి వరకు ఆయా స్థానాలకు ఎంపికపై తీవ్ర స్థాయిలో కసరత్తు చేసింది.
కాగా పటాన్ చెరు నియోజకవర్గానికి సంబంధించి కాటా శ్రీనివాస్ గౌడ్ కు అంతా టికెట్ వస్తుందని ఆశించారు. కానీ అనూహ్యంగా నీలం మధు ముదిరాజ్ కు కేటాయించింది ఏఐసీసీ ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ.
గత 20 ఏళ్లుగా తాము పార్టీ జెండా మోశామని, కానీ నిన్న మొన్న జాయిన్ అయిన మధుకు టికెట్ ఎలా ఇస్తారంటూ ప్రశ్నించారు కాటా సుధ శ్రీనివాస్ గౌడ్. నీలం దగ్గర ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఎంపీ రేవంత్ రెడ్డి(Revanth Reddy)లు డబ్బులు తీసుకున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు.
ఎవరెవరు ఎంతెంత తీసుకున్నారో, ఎవరికి అవి ముట్టాయో కూడా అన్నీ రేపు తన భర్త ఢిల్లీ నుంచి రాగానే ఆధారాలతో సహా బయట పెడతామని హెచ్చరించారు.
Also Read : Tirumala Hundi : శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.70 కోట్లు