Kate Bedingfield : పాకిస్తాన్ (Pakistan) ప్రధాన మంత్రి (Prime Minister) ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) ఇబ్బందుల్లో ఉన్నారు. పదవి ఉంటుందో ఊడుతుందో తెలియడం లేదు. చివరి బంతి వరకు తాను పోరాడుతానని, ఓటమి ఒప్పుకోనంటూ ప్రకటించాడు.
తాను రాజీనామా చేసే ప్రసక్తి లేదని వెల్లడించాడు. ఈ తరుణంలో ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) నోరు జారాడు. తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు విదేశీ శక్తులు ప్రయత్నం చేస్తున్నాయంటూ ఆరోపించాడు.
విదేశీ శక్తులు ఈ కుట్ర వెనుక ఉన్నాయంటూ మండిపడ్డారు ప్రధాని. ప్రతిపక్షాలకు డబ్బులు ఎరగా వేసి కూల్చాలని అనుకుంటున్నారంటూ ఫైర్ అయ్యారు.
పనిలో పనిగా నిన్నటి దాకా అమెరికాతో (America) సత్ సంబంధాలు కొనసాగించారు. ఎప్పుడైతే ఆఫ్గనిస్తాన్ తో రాసుకుంటూ తిరిగారో ఆనాటి నుంచి యూఎస్ పక్కన పెట్టింది ఇమ్రాన్ ఖాన్ ను.
ప్రతిపక్షాలకు డబ్బులు ఎరగా వేసి పాకిస్తాన్ (Pakistan) లో రాజకీయ అస్థిరతను సృష్టిస్తున్నారంటూ సీరియస్ కామెంట్స్ చేశారు ఇమ్రాన్ ఖాన్. ఈ తరుణంలో అమెరికా (America) పై కూడా మనోడు నోరు పారేసుకున్నాడు.
తనను గద్దె దించేందుకు యత్నిస్తోందంటూ ఆరోపించడంపై స్పందించింది ఆ దేశం. వైట్ హౌజ్ ఉన్నతాధికారి కేట్ బెడింగ్ పీల్డ్ (Kate Bedingfield)ఇమ్రాన్ ఖాన్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.
ఆమె మీడియాతో మాట్లాడారు. పాకిస్తాన్ రాజ్యాంగం పట్ల తమకు గౌరవంఉందని, జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. తాను రష్యాతో ములాఖత్ కావడంతో సదరు దేశం తనపై కక్ష కట్టిందన్నాడు.
ఈ సందర్బంగా అమెరికా ప్రభుత్వం ఓ ప్రకటన చేసింది. ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని సూచించింది.
Also Read : కుట్ర నిజం నేనే సుప్రీం – ఇమ్రాన్ ఖాన్