ఐపీఎల్ 16వ సీజన్ లో పేలవమైన ప్రదర్శనతో సన్ రైజర్స్ హైదరాబాద్ తీవ్ర నిరాశకు గురి చేసింది. భారీ ధరకు ఆటగాళ్లను కొనుగోలు చేసినా, జట్టుకు సంబంధించి కీలక మార్పులు చేసినా, హెడ్ కోచ్ , మెంటార్ లను కొత్త వారిని తీసుకున్నా ఆట తీరులో మార్పు రాలేదు. రాజస్థాన్ ను మట్టి కరిపించినా , కొన్ని మ్యాచ్ లు గెలిచినా చివరి దాకా పోరాట పటిమన ప్రదర్శించ లేక పోయింది.
దీంతో జట్టును కోట్లు పెట్టి టేకోవర్ చేసుకున్న అందాల ముద్దుగుమ్మ, సన్ రైజర్స్ హైదరాబాద్ సిఇఓ కావ్య మారన్ తీవ్ర నిరాశకు గురైంది. గత ఏడాది జరిగిన ఐపీఎల్ సీజన్ లో సైతం పేలవమైన ప్రదర్శనతో చివరి స్థానంలో నిలిచింది.
ఈసారి కూడా పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు ఆ జట్టు 11 మ్యాచ్ లు ఆడింది. 4 మ్యాచ్ లు గెలుపొందింది. 7 మ్యాచ్ లలో ఓటమి పాలైంది. దాదాపు గా టోర్నీ నుంచి నిష్క్రమించినట్లే. ఈసారి మినీ ఐపీఎల్ వేలంలో అత్యధిక ధరకు తీసుకకుంది హ్యారీ బ్రూక్ ను. కేవలం ఒకే ఒక్క మ్యాచ్ లో సెంచరీ చేశాడు. ఆ తర్వాత తుస్సుమనిపించాడు. ఇక కెప్టెన్ ను కూడా మార్చింది.
ఐడెన్ మార్క్రామ్ ను ఎంపిక చేసింది. కొంత మేరకు రాణించినా అసలైన టైంలో సత్తా చాటలేక పోయాడు. మొత్తంగా కర్ణుడి చావుకు పలు కారణాలు అన్నట్లు హైదరాబాద్ జట్టు వరుస పరాజయాలతో తట్టుకోలేక తల్లడిల్లి పోయింది కావ్య మారన్. అయ్యో పాపకు ఎందుకింత కష్టం అంటూ మీమ్స్, కామెంట్స్ తో హోరెత్తిస్తున్నారు ఫ్యాన్స్.