KC Venugopal : రేవంత్ నిర్లక్ష్యం వేణుగోపాల్ ఆగ్రహం
భారత్ జోడో యాత్రపై ఏర్పాట్లు ఏవీ
KC Venugopal : ఓ వైపు కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో బలోపేతం చేసే పనిలో నానా తంటాలు పడుతున్నారు ఆ పార్టీ మాజీ చీఫ్, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ. ఆయన ఇప్పటికే కేంద్ర సర్కార్ ను ప్రజా సమస్యలపై నిలదీస్తూ వస్తున్నారు. అంతే కాకుండా 2024 ఎన్నికల్లో పవర్ లోకి రావాలనే ఉద్దేశంతో పార్టీ శ్రేణుల్లో చైతన్యం తీసుకు వచ్చేందుకు ప్లాన్ చేశారు.
ఆ మేరకు 3,570 కిలోమీటర్ల మేర భారీ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ యాత్ర 150 రోజుల పాటు కొనసాగుతుంది. తమిళనాడు లోని కన్యాకుమారి నుంచి ప్రారంభమైన ఈ యాత్ర ఇప్పుడు కర్ణాటకలో కొనసాగుతోంది. తమిళనాడు, కేరళలో పూర్తి చేసుకుంది. ఇదిలా ఉండగా ఏపీలో కొద్ది రోజులే ఉండగా తెలంగాణలో భారత్ జోడో యాత్ర కొన్ని రోజుల పాటు కొనసాగనుందని ఏఐసీసీ స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా టీపీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి ఈరోజు వరకు యాత్రకు సంబంధించిన ఏర్పాట్లు చేయక పోవడంపై ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇంఛార్జి కేసీ వేణుగోపాల్(KC Venugopal) సీరియస్ అయ్యారు. ఇప్పటి వరకు కనీసం ఒక్క హోర్డింగ్ కూడా ఎందుకు పెట్టలేదంటూ నిలదీశారు.
ఏర్పాట్లలో పూర్తిగా ఫెయిల్ అయ్యారంటూ మండిపడ్టారు. స్వంత ప్రచారం తప్ప పార్టీకి సంబంధించి ఇంత వరకు వర్క్ డివిజన్ ఎందుకు చేయలేదంటూ ప్రశ్నించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా భారత్ జోడో యాత్ర పూర్తయ్యేంత దాకా మాణిక్యం ఠాగూర్ తెలంగాణలోనే ఉండాలని కేసీ వేణుగోపాల్ ఆదేశించారు.
పీసీసీ ఛాంబర్ లో అంతర్గత సమావేశంలో గరం గరం అయినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
Also Read : బీజేపీలో మీ వారసుల చిట్టా విప్పండి