KCR: బీజేపీలోకి రేవంత్ జంప్ అవుతారేమో – కేసీఆర్
బీజేపీలోకి రేవంత్ జంప్ అవుతారేమో - కేసీఆర్
KCR: మేము పదేళ్లపాటు కడుపులో పెట్టుకున్న రైతులు… మూడు నెలల కాంగ్రెస్ పాలనలో ఆగం అయ్యారని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) అన్నారు. రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, సాగుకు కరెంటు లేదు. కాంగ్రెస్ ఐదేళ్లు అధికారంలో ఉండాలి, అప్పుడే మంచి… చెడుకి మధ్య తేడా తెలుస్తుంది. కానీ, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కూడా ఉండేలా లేదు. ఎవరు ఎప్పుడు బీజేపీలో చేరుతారో తెలియదు. స్వయంగా ముఖ్యమంత్రే జంప్ కొడతారేమో తెలియదు. బీజేపీకు ఓటు వేసినా… మంజీరా నదిలో వేసిన ఒకటే. బీజేపీ మనకు అక్కరకు రాని చుట్టం… దాన్ని వదిలేసుకోవాలి’’ అని కేసీఆర్ అన్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డిలోని సింగూరు చౌరస్తాలో ఏర్పాటు చేసిన ‘బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ’లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆకాంక్షలు నెరవేరాలంటే పార్లమెంట్లో బీఆర్ఎస్ సభ్యులు ఉండాలన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడిగితే… కాంగ్రెస్ నాయకులు బూతులు తిడుతున్నారు. నేను పదేళ్లు సీఎంగా ఉన్నా… ఏ నాడూ ఇలా మాట్లాడలేదు. ఎవరినీ వేధించలేదు, దౌర్జన్యం చేయలేదు. ఆలోచించకుండా ఓటు వేసి ఇప్పటికే దెబ్బతిన్నాం. ప్రజాస్వామ్యంలో బాగా ఆలోచించి ఓటు వేయాలి. మెదక్ జిల్లా ప్రజలు ఇచ్చిన ధైర్యంతోనే తెలంగాణ సాధించానన్నారు. తన రాజకీయ ఎదుగుదలలో మెతుకు సీమది కీలక పాత్ర అని కేసీఆర్ అన్నారు.
KCR – అంబేడ్కర్ ను అవమానిస్తే చూస్తూ కూర్చుందామా?
‘‘అంబేడ్కర్‌ను గుండెల్లో పెట్టుకోవాలనే సచివాలయం ఎదురుగా 125 అడుగుల విగ్రహం పెట్టుకున్నాం. ఆయన జయంతి రోజున విగ్రహం దగ్గరకు ఈ ప్రభుత్వం వెళ్లనేలేదు. కనీసం పూలు పెట్టలేదు..నివాళులర్పించలేదు. నేను నిర్మించానని అంబేడ్కర్ విగ్రహం వద్దకు వెళ్లలేదు. మరి సచివాలయం నేనే నిర్మించా.. అందులో కూర్చుంటున్నారు కదా! యాదాద్రి ఆలయం నేనే నిర్మించా… మరి దానిని కూడా మూసేస్తారా ? అంబేడ్కర్ ను అవమానిస్తే చూస్తూ కూర్చుందామా ? అవమానించిన వారికి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి. డిసెంబరు 9న రుణమాఫీ చేస్తామన్నారు. నాలుగు నెలలు గడిచినా చేయలేదు. మళ్లీ… ఆగస్టు 15లోపు అంటున్నారు. వెంటనే రూ.2లక్షల రుణమాఫీ చేయాలి. దీని కోసం కాంగ్రెస్ ప్రభుత్వంపై యుద్ధం చేద్దాం. రుణమాఫీ, వరికి బోనస్ కోసం పోస్టుకార్డు ఉద్యమం చేయాలి.
Also Read:Civil Services Results: ఇంటర్వ్యూ వేళ తల్లి మృతి ! అయినా ‘సివిల్స్’లో రెండో ర్యాంకు !