KCR Elections : ముంద‌స్తుకు వెళ్లం 105 సీట్లు ఖాయం

మ‌ళ్లీ తెలంగాణ‌లో కారుదే హ‌వా

KCR Elections : తెలంగాణ సీఎం కేసీఆర్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లే ప్ర‌స‌క్తి లేద‌ని స్ప‌ష్టం చేశారు. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 100 నుంచి 105 సీట్లు గంప గుత్త‌గా గెలుస్తామ‌ని ధీమా వ్య‌క్తం చేశారు.

త‌మ‌ను అడ్డుకునే శ‌క్తి ఎవ‌రికీ లేద‌న్నారు. టీఆర్ఎస్ఎల్పీ స‌మావేశం (KCR Elections)ముగిసిన అనంత‌రం కేసీఆర్ మీడ‌యాతో మాట్లాడారు. దేశంలో స‌వాల‌క్ష స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని వాటిని పరిష్క‌రించ‌కుండా మోదీ నిద్ర పోతున్నాడంటూ ఆరోపించారు.

కులం, మ‌తం, ప్రాంతాల పేరుతో ప్ర‌జ‌ల‌ను విభ‌దీస్తూ , బెదిరిస్తూ ఎన్నిక‌ల్లో ల‌బ్ది పొందాల‌ని అనుకుంటోందంటూ మండిప‌డ్డారు. ఈ దేశానికి కావాల్సింది క‌శ్మీర్ ఫైల్స్ కాదు డెవ‌ల‌ప్ మెంట్ ఫైల్స్ కావాల‌న్నారు.

కేంద్రం అనుస‌రిస్తున్న తీరుపై చ‌ర్చించామ‌న్నారు. టీఆర్ఎస్ చేప‌ట్టే రైతు ధ‌ర్నాకు క‌లిసి రావాల‌ని పిలుపునిచ్చారు. ఇవాళ ఆయ‌న పీఎంను టార్గెట్ చేశారు. దేశ రాజ‌కీయాల‌లో తాను ప్ర‌ముఖ పాత్ర పోషిస్తాన‌ని స్ప‌ష్టం చేశారు.

ఈడీ, బోడిల‌కు తాను భ‌య‌ప‌డేటోన్ని కాన‌న్నారు. సీబీఐ, ఐటీ దాడులంటే తాను వెన‌క్కి త‌గ్గేది లేద‌న్నారు. స్కాంలు, అవినీతి, అక్ర‌మాల‌కు పాల్ప‌డే వారు భ‌య‌ప‌డ‌తార‌ని తాము కామ‌న్నారు.

మోదీ బెదిరింపుల‌కు తాము భ‌య‌ప‌డ బోమ‌మ‌ని వార్నింగ్ హెచ్చ‌రించారు. వ‌న్ నేష‌న్ వ‌న్ ప్రొక్యూర్ మెంట్ ఎందుకు ఉండ‌కూడ‌ద‌ని ప్ర‌శ్నించారు కేసీఆర్. ఇండియా గేటు వ‌ద్ద ధాన్యాన్ని పోస్తామ‌న్నారు.

స‌మాజాన్ని విభ‌జించే రాజ‌కీయాలు తెలంగాణ‌లో జ‌రుగుతున్నాయ‌ని ఆరోపించారు సీఎం కేసీఆర్(KCR Elections). దేశంలో ఖాళీగా 15 ల‌క్ష‌ల జాబ్స్ ఖాళీగా ఉన్నాయ‌ని భ‌ర్తీ చేయాల‌ని డిమాండ్ చేశారు.

Also Read : టీఆర్ఎస్ ప‌త‌నం బీజేపీ విజ‌యం

Leave A Reply

Your Email Id will not be published!