KCR Dasoju : కేసీఆర్ ఈ పేరు గురించి తెలియని వారుండరు. రాజకీయ వేత్తగా , ఉద్యమ నాయకుడిగా గుర్తింపు పొందారు. కవిగా, రచయితగా, గాయకుడిగా , సాహిత్య పిపాసకుడిగా గుర్తింపు పొందారు. రాదనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తీసుకు వచ్చాడు. మలి దశ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన ఘనత కూడా ఆయనదే. తాను ఒక్కసారి నమ్మాడంటే ఇక వెనుదిరిగి చూడడం అంటూ ఉండదు కేసీఆర్ కు.
KCR Dasoju Words
ఆయనను దూషించిన వాళ్లు, విమర్శించిన వాళ్లు అనేకం ఉన్నారు. కానీ తనను నమ్ముకున్న వాళ్లకు , తాను గుర్తించిన వాళ్లను సాధ్యమైనంత వరకు ఎక్కడో ఒక చోట వాళ్లకు గుర్తింపు వచ్చేలా చేశారు. తాజాగా అందుకు ప్రత్యక్ష నిదర్శనం డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్(Dasoju Sravan Kumar) ఆచారి.
తాజాగా ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కుర్రా సత్యనారాయణతో పాటు నల్లగొండ జిల్లాకు చెందిన దాసోజుకు తీపి కబురు చెప్పారు. గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా సిఫారసు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం తీర్మానం చేసింది. ఇదిలా ఉండగా దాసోజు శ్రవణ్ కు అపారమైన అనుభవం ఉంది.
రాజకీయ నాయకుడే కాదు అద్భుతమైన విశ్లేషకుడు, విద్యావేత్త, కన్సల్టెంట్ గా ఉన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకమైన పాత్ర పోషించాడు. ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్ కు కుడి భుజంగా ఉన్నారు. కేసీఆర్ , దాసోజు కలిసి ఫామ్ హౌస్ లో నిల్చుని మాట్లాడుతున్న ఫోటో వైరల్ గా మారింది.
Also Read : CM KCR : సీఎం భరోసా వరద బాధితులకు ఆసరా