KCR : తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. ఆయన ప్రకటించిన విధంగానే ఇవాళ్టి నుంచి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 80 వేల 39 పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించారు.
ఈరోజు నుంచే నోటిఫికేషన్లు జారీ చేస్తామని వెల్లడించారు కేసీఆర్(KCR ). ఆయా శాఖలల్లో అత్యధిక జాబ్స్ విద్యా శాఖలో ఉన్నాయని డిక్లేర్ చేశారు. అన్ని శాఖలకు సంబంధించిన అన్ని పోస్టులను ఇవాళ తమకు అందజేశాయని చెప్పారు.
అటెండర్ నుంచి ఆర్డీఓ స్థాయి దాకా పోస్టులన్నీ స్థానికులకే ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. ఇప్పటి వరకు గ్రూప్ -1 పోస్టులు 503, గ్రూప్ -2 పోస్టులు 582, గ్రూప్ -3 పోస్టులు 1373 , గ్రూప్ -4 పోస్టులు 9168 , జిల్లా స్థాయిలో 39, 892 ఉద్యోగాల ఖాళీలు, లక్షా 56 వేల ఉద్యోగాలు నోటిఫై చేశామని చెప్పారు కేసీఆర్.
తెలంగాణ ఏర్పాటు చరిత్రలో ప్రత్యేక ఘట్టమని సీఎం స్పష్టం చేశారు. రాజకీయాలంటే వేరే పార్టీలకు ఒక ఆట అని కానీ తమకు ఒక టాస్క్ అని ప్రకటించారు.
ఆయా పార్టీల నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. ఇవాళ ప్రకటించే నోటిఫికేషన్లలో 95 శాతం స్థానికులకు మాత్రమే ఉద్యోగాలు వస్తాయని చెప్పారు.
గత కొంత కాలంగా ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు తీపి కబురు చెప్పారు కేసీఆర్. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో తెలంగాణ తెచ్చుకున్నామని చెప్పారు.
గత కొంత కాలంగా ఏపీ అడ్డు తగులుతూ వచ్చిందని ఆరోపించారు. ఇప్పటికీ ఇంకా సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. ఈరోజు నుంచే నోటిఫికేషన్లు ఆయా శాఖలు జారీ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
Also Read : ఎమ్మెల్సీ కవిత ఇంట మహిళా దినోత్సవ వేడుకలు