KCR EX CM : ఆస్ప‌త్రిలో ఉన్నా కేసీఆర్ బిజీ

చ‌ద‌వ‌డం ఆప‌ని మాజీ సీఎం

KCR EX CM : హైద‌రాబాద్ – బీఆర్ఎస్ బాస్ , మాజీ సీఎం కేసీఆర్ వైర‌ల్ గా మారారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చాయి. అధికారంలో ప‌దేళ్ల పాటు కొలువు తీరింది బీఆర్ఎస్ పార్టీ. ఇదే స‌మ‌యంలో ఉద్య‌మ నాయ‌కుడిగా గుర్తింపు పొందారు కేసీఆర్(KCR). ఎమ్మెల్యేగా, డిప్యూటీ స్పీక‌ర్ గా, కేంద్ర మంత్రిగా ప‌నిచేశారు. ఆ త‌ర్వాత అనూహ్యంగా దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారారు. త‌న వాక్ చాతుర్యంతో , ప్ర‌తిభా పాట‌ల‌తో అంద‌రినీ ఆక‌ట్టుకున్నారు. ప్ర‌తిప‌క్షాల‌ను సైతం నివ్వెర పోయేలా చేశారు.

KCR EX CM Viral

కానీ అనుకోకుండా బీఆర్ఎస్ స‌ర్కార్ కు కోలుకోలేని రీతిలో ప్ర‌జ‌లు షాక్ ఇచ్చారు. మొత్తం 119 సీట్ల‌కు గాను 39 సీట్ల‌కే ప‌రిమితం చేశారు గులాబీ పార్టీని. విచిత్రం ఏమిటంటే గ‌తంలో మ‌ద‌న్ మోహ‌న్ చేతిలో ఓట‌మి పొందిన కేసీఆర్ ఆ త‌ర్వాత ఉన్న‌ట్టుండి 2023లో జ‌రిగిన శాస‌న స‌భ ఎన్నిక‌ల్లో రెండు చోట్ల పోటీ చేశారు. గ‌జ్వేల్ లో గెలుపొంద‌గా కామారెడ్డిలో కాటిప‌ల్లి వెంక‌ట ర‌మ‌ణా రెడ్డి చేతిలో ప‌రాజ‌యం పాల‌య్యారు.

దీంతో సీఎం ప‌ద‌విని కోల్పోవ‌డంతో తీవ్ర ఆలోచ‌న‌ల్లోకి కూరుకు పోయారు. ఇదే క్ర‌మంలో ఎర్ర‌వెల్లి ఫామ్ హౌస్ కు ఎలాంటి సెక్యూరిటీ లేకుండానే వెళ్లి పోయారు. అక్క‌డ అనుకోకుండా బాత్రూంలో జారి ప‌డ్డారు.
ప్ర‌స్తుతం య‌శోద ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఓట‌మి పాలైనా నిరుత్సాహ ప‌డ‌కుండా బెడ్ మీద నుండి చ‌ద‌వ‌డం ప్రారంభించారు.

Also Read : Seethakka Minister : బాధ్య‌త‌లు స్వీక‌రించిన సీత‌క్క

Leave A Reply

Your Email Id will not be published!