Seethakka Minister : బాధ్య‌త‌లు స్వీక‌రించిన సీత‌క్క

సంత‌కం చేయించిన స్మితా స‌బ‌ర్వాల్

Seethakka : హైద‌రాబాద్ – ఒక‌ప్పుడు న‌క్స‌లైట్ గా ఉన్న దాస‌రి సీత‌క్క గురువారం రాష్ట్ర కేబినెట్ లో మంత్రిగా కొలువు తీరారు. తన జీవితంలో ఏనాడూ కోరుకోని స్థానాన్ని పొందారు. స‌చివాల‌యంలో తెలంగాణ పంచాయ‌తీరాజ్ , గ్రామీణాభివృద్ది, మ‌హిళా సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించారు సీత‌క్క‌.

Seethakka take Charge as a Minister

ములుగు నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆమె ఎన్నో అవ‌మానాలు ఎదుర్కొన్నారు. క‌రోనా క‌ష్ట కాలంలో త‌ను ఒక్క‌త్తే బ‌య‌ట‌కు వ‌చ్చి విశిష్ట‌మైన సేవ‌లు అందించారు. గ‌తంలో ఉన్న బీఆర్ఎస్ స‌ర్కార్ దాస‌రి సీత‌క్క‌ను(Seethakka) ఓడించేందుకు నానా తంటాలు ప‌డింది.

అంతేకాకుండా ఆమె ఎమ్మెల్యేగా ఉన్న‌ప్ప‌టికీ నిధులు ఇవ్వ‌కుండా ఇబ్బంది పెట్టింది. అంతే కాదు తాజా ఎన్నిక‌ల్లో త‌న‌ను ఓడించేందుకు చేయ‌ని ప్ర‌య‌త్నం అంటూ ఏదీ లేదు. వంద‌ల కోట్లు ఖ‌ర్చు చేసినా చివ‌ర‌కు త‌న నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు త‌న‌ను గెలిపించి శాస‌న స‌భ‌కు పంపించార‌ని అన్నారు దాస‌రి సీత‌క్క‌.

తాను నిత్యం పూజించే స‌మ్మ‌క్క‌, సార‌ల‌మ్మ దేవ‌త‌ల‌కు రుణ‌ప‌డి ఉంటాన‌ని స్ప‌ష్టం చేశారు. త‌న‌కు మంత్రిగా అవ‌కాశం ఇచ్చినందుకు సీపీపీ చైర్ ప‌ర్స‌న్ సోనియా గాంధీ, పార్టీ చీఫ్ ఖ‌ర్గే, మాజీ చీఫ్ రాహుల్ గాంధీ, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీతో పాటు సీఎం రేవంత్ రెడ్డికి ధ‌న్య‌వాదాలు తెలిపారు.

Also Read : Sridhar Babu : ఐటీ మంత్రిగా కొలువు తీరిన దుద్దిళ్ల‌

Leave A Reply

Your Email Id will not be published!