Bandi Sanjay KCR : కేసీఆర్‌కు ఈ దేశంలో ఉండే హక్కు లేదు
నిప్పులు చెరిగిన బీజేపీ స్టేట్ చీఫ్ బండి
Bandi Sanjay KCR : భారత రాజ్యాంగం పట్ల ఏ మాత్రం గౌరవం లేని సీఎం కేసీఆర్ కు ఈ దేశంలో ఒక్క క్షణం కూడా ఉండే హక్కు లేదన్నారు భారతీయ జనతా పార్టీ చీఫ్ బండి సంజయ్(Bandi Sanjay). రాజ్ భవన్ లో జరిగిన రిపబ్లిక్ డే ఉత్సవాలకు కావాలని గైర్హాజర్ అయ్యారంటూ ఆరోపించారు. బీజేపీ స్టేట్ చీఫ్ మీడియాతో మాట్లాడారు.
కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. కేసీఆర్ పదే పదే చైనాను పొగుడుతున్నారని కానీ దేశంలో జరుగుతున్న అభివృద్దిని పట్టించు కోవడం లేదన్నారు బండి సంజయ్. దేశాన్ని ద్వేషిస్తున్న కేసీఆర్ పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేక వ్యక్తిగా మారి పోయారంటూ ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని, న్యాయ వ్యవస్థలను , జాతీయ జెండాలను అవమానించిన కేసీఆర్ కు ఇక్కడ ఉండే అర్హత లేదన్నారు.
మొదటి నుంచీ ఆయనకు రాజ్యాంగం పట్ల నమ్మకం కానీ గౌరవం కానీ లేదన్నారు బండి సంజయ్(Bandi Sanjay). దేశాన్నే కాదు మొత్తం హిందువులను, హిందూ మతాన్ని, జాతిని ద్వేషిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్ర హైకోర్టు ఆదేశించినా పరేడ్ గ్రౌండ్స్ లో గణతంత్ర దినోత్సవాన్ని కావాలని నిర్వహించ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాకిస్తాన్, బంగ్లాదేశ్ , చైనా, శ్రీలంక దేశాలపై కేసీఆర్ కు ప్రేమ తప్ప భారత్ దేశం పట్ల పూర్తి వ్యతిరేకత కలిగి ఉన్నారని వెంటనే ఆయన కుటుంబాన్ని దేశం నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు బండి సంజయ్ కుమార్. తన కొడుకు కేటీఆర్, కూతురు కవిత , అల్లుడు హరీష్, సంతోష్ రావు కోసం భారత రాజ్యాంగాన్ని మార్చాలని అనుకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు.
Also Read : కేసీఆర్ వీఆర్ఎస్ తీసుకుంటే బెటర్