KCR : అధికారాన్ని పక్కన పెట్టారు. అణచివేతను ప్రశ్నించారు. యాస పేరుతో, భాష పేరుతో , ప్రాంతం పేరుతో , పాలన పేరుతో వంచిస్తూ వచ్చిన వారికి చెంప ఛెల్లు మనిపించేలా ఉద్యమానికి శ్రీకారం చుట్టారు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అలియాస్ కేసీఆర్.
ఆయన రాజకీయ నాయకుడే కాదు ఉద్యమ నాయకుడు. సాహితీ పిపాసకుడు, పాలనా దక్షుడు, కవి, రచయిత, వక్త, లక్షలాది జనాన్ని మెస్మరైజ్ చేసి స్పూర్తి నింపే పొలిటికల్ లీడర్.
అంతకు మించి అపర భక్తుడు. సంస్కృతి, సంప్రదాయాల పట్ల అత్యంత నమ్మకాన్ని, ప్రేమను కనబరిచే ఏకైక నాయకుడు కేసీఆర్( KCR). ఈ మూడు అక్షరాలు కోట్లాది ప్రజలను ప్రభావితం చేశాయి.
ఇంకా చేస్తూనే ఉన్నాయి. అనర్ఘలమైన వాగ్ధాటి. అంతే కాదు సమస్త అంశాల పట్ల పూర్తిగా అవగాహన కలిగిన ఏకైక డైనమిక్ లీడర్. కొన్ని తరాల నుంచి కొన్ని దశాభ్దాల నుంచి ఈ ప్రాంతంలో తెలంగాణ అన్న పదం నిషేధం.
ఎవరైనా మాట్లాడితే వారిని చులకనగా చూసే పరిస్థితి. కానీ ఇవాళ తెలంగాణ ఒక యూనివర్శల్ నేమ్. అన్ని రంగాలలో దూసుకు పోతోంది. కాదని, రాదని అనుకున్న రాష్ట్రాన్ని ఆచరణలో తీసుకు వచ్చేలా చేసిన ఘనత ఒక్క కేసీఆర్ దే.
అందరినీ, అన్ని పార్టీలను ఒప్పించి రాష్ట్రం సాకారం అయ్యేలా చేసిన ఏకైక నాయకుడు అతడే. బహు భాషా కోవిదుడు. అటు ఆంగ్లంలో ఇటు ఉర్దూలో అద్భతంగా ప్రసంగించే విలక్షణ లీడర్ కేసీఆర్. కేసీఆర్ ఒక వ్యక్తి కాదు ఓ శక్తి.
Also Read : టీఆర్ఎస్ నాలుగున్నర కోట్ల ప్రజల ఆస్తి