KCR Kandikonda : ప్రముఖ సినీ గేయ రచయిత కందికొండ యాదగిరి క్యాన్సర్ తో బాధ పడుతూ ఇవాళ కన్ను మూశారు. ఆయన మరణ వార్త విన్న వెంటనే సీఎం కేసీఆర్ స్పందించారు. తెలంగాణ ప్రాంతానికి, ప్రత్యేకించి సినీ, సాహిత్య రంగానికి తీరని లోటు అని పేర్కొన్నారు.
తన జీవిత కాలమంతా ఈ మట్టి కోసం, ఈ ప్రాంతం కోసం, యాస, భాషను బతికించేందుకు ఎనలేని కృషి చేశారని కొనియాడారు. ఒక రకంగా తనను బాధకు గురి చేసిందని తెలిపారు.
ఒక ఆత్మీయుడిని, పాట పట్ల, మట్టి పట్ల ఉన్న నిబద్దతను ఈ సందర్భంగా ప్రస్తావించకుండా ఉండలేనని పేర్కొన్నారు. ఎన్నో అద్భుతమైన పాటలు రాశాడని ఆయన లేని లోటు పూడ్చ లేనిదని స్పష్టం చేశారు సీఎం.
ఆయన మృతి పట్ల సంతాపాన్ని తెలియ చేస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ సంబండ వర్గాల సంస్కృతిని తన పాట ద్వారా అజరామరంగా నిలిపాడని ప్రశంసించారు.
ఈ ఓరుగల్లు బిడ్డ కందికొండ మరణం తెలంగాణ ప్రాంతానికి అతి పెద్ద లోటుగా పేర్కొన్నారు కేసీఆర్(KCR Kandikonda ). పాటల రచయితగా తెలుగు సినీ సాహిత్య రంగాలలో తనదైన ముద్ర కనబర్చిన గొప్ప రచయిత కందికొండ అంటూ కితాబు ఇచ్చారు.
కందికొండను కాపాడుకునేందుకు ప్రభుత్వం పలు ప్రయత్నాలు చేసిందన్నారు. కానీ ఆ దేవుడు ఇలా విషాదాన్ని నింపాడని వాపోయారు.
వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియ చేస్తున్నానని తెలిపారు కేసీఆర్. కందికొండ మరణంతో టాలీవుడ్ లో విషాదం అలుముకుంది.
Also Read : పాదయాత్రకు శ్రీకారం సర్కార్ పై పోరాటం