KCR : దేశంలో గవర్నర్ వ్యవస్థపై సంచలన కామెంట్స్ చేశారు సీఎం కేసీఆర్(KCR). రాజ్యాంగానికి విరుద్దంగా ఇప్పుడు నడుస్తోందంటూ మండిపడ్డారు. బీజేపీయేతర రాష్ట్రాలలో దారుణంగా ఉందన్నారు.
ఇందుకు ఉదాహరణగా తమిళనాడులో సీఎం స్టాలిన్ వర్సెస్ గవర్నర్ రవి, పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ వర్సెస్ గవర్నర్ ధన్ కర్ , మహారాష్ట్ర లో సీఎం ఉద్దవ్ ఠాక్రే వర్సెస్ గవర్నర్ , కేరళలో సీఎం విజయన్ వర్సెస్ గవర్నర్ ల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందన్నారు.
ఇక తెలంగాణలో కూడా ఇదే రీతిన కొనసాగుతోందంటూ పరోక్షంగా నిప్పులు చెరిగారు. వీసీలను నియమించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే ఉందని, కానీ అలా తమిళనాడులో జరగడం లేదని ఆ రాష్ట్ర సీఎం ఇటీవలే మండిపడ్డారు.
అక్కడ స్టాలిన్ , ఆర్ఎన్ రవి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇదే సమయంలో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఏకంగా ఢిల్లీలో, హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై సీరియస్ కామెంట్స్ చేశారు.
ఆమె చెన్నైలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరై కొందరు సీఎంలు నియంతల్లాగా వ్యవహరిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఈ తరుణంలో బుధవారం హైదరాబాద్ లో జరిగిన టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవంలో కేసీఆర్ ప్రసంగించారు.
గవర్నర్ వ్యవస్థపై నిప్పులు చెరిగారు. ఆయన ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని ఆనాడు గవర్నర్ ఒక్క పెన్ను పోటుతో రద్దు చేశారని, ఆ తర్వాత తానే అడ్రస్ లేకుండా పోయాడన్నారు.
రాజ్యాంగబద్దమైన పదవిని దుర్వినియోగం చేస్తున్నారంటూ సంచలన కామెంట్ చేశారు కేసీఆర్.
Also Read : కేసీఆర్ పోరాట యోధుడు పాలనాదక్షుడు