KCR : దేశ వ్యాప్తంగా కేసీఆర్ టూర్
ఢిల్లీ పర్యటనతో సీఎం శ్రీకారం
KCR : తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపకుడు, ప్రస్తుత పార్టీ చీఫ్, సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముందస్తు చెప్పినట్లుగానే యుద్ధానికి బయలు దేరారు. ఇవాళ ఆయన ఢిల్లీ టూర్ తో తన దేశ వ్యాప్త పర్యటన ప్రారంభం కానుంది.
ఇందుకు సంబంధించి రోడ్ మ్యాప్ కూడా సిద్దం చేశారు. జాతీయ రాజకీయాలపై తనదైన ముద్ర వేయాలన్న సంకల్పం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ మొదటి నుంచీ చెబుతూ వస్తున్నారు.
రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతోందంటూ మోదీ సర్కార్ పై నిప్పులు చెరుగుతున్నారు. శుక్రవారం నుంచి వివిధ రాష్ట్రాలలో పర్యటించేందుకు సిద్దమయ్యారు.
తాజాగా తమిళనాడు సినీ ఇండస్ట్రీలో భారీ అభిమానులను కలిగిన ఇలయ తలపతి సీఎం కేసీఆర్(KCR)ను ప్రగతి భవన్ లో కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
వ్యూహకర్త పీకే, నటుడు ప్రకాశ్ రాజ్ , పలువురు మేధావులు, రిటైర్డ్ ఆఫీసర్లతో భేటీ అనంతరం తన టూర్ ఖరారు చేశారు. ఇందుకు సంబంధించి ఎవరెవరిని కలవాలనే దానిపై కూడా ఆయన కసరత్తు చేశారు.
రాజకీయ, ఆర్థిక, మీడియా రంగాలకు చెందిన ప్రముఖులతో సమావేశం కానున్నారు. గల్వాన్ లో మరణించిన కుటుంబాలను, రైతు సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన పోరులో ప్రాణాలు కోల్పోయిన రైతుల ఫ్యామిలీని పరామర్శిస్తారు.
ఇదిలా ఉండగా ప్లీనరీ సందర్భంగా టీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా మార్చే క్రమంలో దానిని భారతీయ రాష్ట్ర సమితిగా మార్చనున్నట్లు టాక్. 22న కేసీఆర్(KCR) ఛండీగఢ్ కు వెళతారు.
ఢిల్లీ, పంజాబ్ సీఎంలతో కలిసి చెక్కులు అందజేస్తారు. 26న బెంగళూరులో మాజీ పీఎం దేవెగౌడ, మాజీ సీఎం కుమార స్వామిలతో సమావేశం కానున్నారు.
27న రాలేగావ్ సిద్దికి వెళ్లి అన్నా హజారేను కలుస్తారు. 29, 30 తేదీల్లో బెంగాల్, బీహార్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు కేసీఆర్.
Also Read : టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులు వీరే