KCR Modi : పెరిగిన అంత‌రం మోదీ టూర్ కు దూరం

26న హైద‌రాబాద్ కు రానున్న ప్ర‌ధాన మంత్రి

KCR Modi : నిన్న‌టి దాకా చెట్టాప‌ట్టాల్ వేసుకున్న క‌మ‌లం, గులాబీ ద‌ళం ఇప్పుడు క‌స్సు బుస్సు మంటున్నాయి. నువ్వా నేనా అంటూ మాట‌ల తూటాలు పేల్చుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయ‌ర్ స్వామి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఏర్పాటు చేసిన రామానుజుడి విగ్ర‌హ ఆవిష్క‌ర‌ణ‌కు హాజ‌ర‌య్యారు మోదీ. ఆ స‌మ‌యంలో సీఎం కేసీఆర్(KCR Modi) డుమ్మా కొట్టారు.

ఇష్టం లేక‌నే ఆయ‌న ఈ ప‌ని చేశారంటూ అప్ప‌ట్లో బీజేపీ శ్రేణులు మండిప‌డ్డాయి. ఒక దేశ ప్ర‌ధాని వ‌స్తే రాజ‌కీయాలు ప‌క్క‌న పెట్టి ప్రోటోకాల్ పాటించ‌డం తెలియ‌దా అంటూ ఆరోపించాయి.

అది ప‌క్క‌న పెడితే ప్ర‌స్తుతం ప్ర‌ధాని మోదీ(Modi) రెండు రోజుల టూర్ లో భాగంగా జ‌పాన్ లో ఉన్నారు. ఆయ‌న క్వాడ్ స‌ద‌స్సులో పాల్గొంటారు. అనంత‌రం ఇండియాకు విచ్చేస్తారు.

ఈనెల 26న ప్ర‌ధాన మంత్రి హైద‌రాబాద్ కు రానున్నారు. ఇప్ప‌టికే ఆయ‌న ప‌ర్య‌ట‌న ఖ‌రారు కూడా అయ్యింది. అదే రోజు సీఎం కేసీఆర్(KCR) క‌ర్ణాట‌క‌కు వెళ్ల‌నున్నారు.

అక్క‌డ దేశ మాజీ ప్ర‌ధాన మంత్రి హెచ్ డీ దేవె గౌడ‌, ఆయ‌న కుమారుడు మాజీ సీఎం హెచ్ డి కుమార స్వామితో భేటీ కానున్నారు. దేశ రాజ‌కీయాల‌లో చ‌క్రం తిప్పాల‌న్న క‌సితో గ‌త కొన్ని రోజులుగా కేసీఆర్ ప‌ర్య‌టిస్తున్నారు.

పంజాబ్ లో రైతు కుటుంబాల‌కు రూ. 3 లక్ష‌ల చొప్పున ప‌రిహారం అంద‌జేశారు. ఇదిలా ఉండ‌గా హైద‌రాబాద్ లోని ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్ బి) పీజీ విద్యార్థుల స్నాత‌కోత్స‌వంలో ప్ర‌ధాని పాల్గొంటారు. ఈ కార్య‌క్ర‌మానికి సీఎం హాజ‌రు కావ‌డం లేద‌ని స‌మాచారం.

Also Read : లైఫ్ సైన్సెస్ లో సంస్క‌ర‌ణ‌లు అవ‌స‌రం

Leave A Reply

Your Email Id will not be published!