KCR & Rakesh Tikait : కేసీఆర్ దిశా నిర్దేశం తికాయత్ ముహూర్తం
దేశ వ్యాప్తంగా రైతు సభలకు శ్రీకారం
KCR & Rakesh Tikait : రాకేశ్ తికాయత్ దేశంలో పేరొందిన రైతు ఉద్యమ అగ్ర నాయకుడు. రైతులకు న్యాయం చేయాలని గత కొంత కాలంగా ఉద్యమిస్తున్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ చీఫ్, తెలంగాణ సీఎంతో(KCR & Rakesh Tikait) కలిసి ఆయన ఇప్పటికే ఢిల్లీలో జరిగిన రైతు సభలో పాల్గొన్నారు.
సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ మేరకు కేసీఆర్ కొత్తగా దేశ వ్యాప్తంగా పార్టీ పెట్టి విస్తరించే పనిలో పడ్డారు. ఆ క్రమంలోనే తికాయత్ తో పలుమార్లు చర్చించారు. ఇందుకు సంబంధించి దేశంలోని అన్ని ప్రాంతాలలో రైతు సభలు నిర్వహించాలని నిర్ణయించారు.
ఇందులో భాగంగా సంయుక్త కిసాన్ మోర్చా అగ్ర నాయకుడైన రాకేశ్ తికాయత్ హైదరాబాద్ కు విచ్చేశారు. ఆయన రెండు రోజుల పాటు సీఎం కేసీఆర్ తో చర్చిస్తున్నారు.
దేశ వ్యాప్తంగా రైతు సభలకు సంబంధిచి రూట్ మ్యాప్ సిద్దం చేశారు. ఇందులో రాకేశ్ తికాయత్(KCR & Rakesh Tikait) సభలు ఎలా నిర్వహించాలి, ఏమేం మాట్లాడాలి, ప్రధాన ఎజెండా ఏం ఉండాలనే దానిపై సుదీర్గంగా మంతనాలు జరిపారు.
మొదటగా తెలంగాణ నుంచే రైతు సభలు ప్రారంభించాలని నిర్ణయించారు తికాయత్, కేసీఆర్. నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో సభలు చేపట్టాలని డిసైడ్ చేశారు.
తెలంగాణలో అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలను దేశ వ్యాప్తంగా ప్రచారం చేయనున్నారు. తికాయత్ తో పాటు మరో ఇద్దరు అగ్ర నాయకులు కూడా పాల్గొన్నట్లు సమాచారం.
సభలకు సంబంధించి ఆగస్టు మొదటి వారంలో నిర్వహించేందుకు నిర్ణయించారు. ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాలలో రైతు సభలు నిర్వహించేందుకు షెడ్యూల్ , తేదీలు ఖరారు కూడా చేసినట్లు సమాచారం.
Also Read : యూనివర్శిటీల్లో ఖాళీల భర్తీపై సర్కార్ వివక్ష