Rahul Gandhi : ఆప్ మాజీ నేత కుమార్ విశ్వాస్ చేసిన ఆరోపణలపై ఎందుకు క్లారిటీ ఇవ్వడం లేదని సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi).
ఖలిస్తాన్ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నారా లేదా అన్నది స్పష్టం చేయకుండా ఎందకు మౌనంగా ఉన్నారో దేశానికి చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు.
అరవింద్ కేజ్రీవాల్ పై సీరియస్ అయ్యారు. ఇదిలా ఉండగా పంజాబ్ లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రధాన పోటీదారుగా ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ.
ఈ తరుణంలో ఒకప్పుడు అరవింద్ కేజ్రీవాల్ కు సన్నిహితుడిగా ఉంటూ ఆ తర్వాత పార్టీ నుంచి దూరమైన కవి, ఆప్ నాయకుడు కుమార్ విశ్వాస్ సంచలన ఆరోపణలు చేశారు.
కేజ్రీవాల్ మామూలోడు కాదని ఆయన పంజాబ్ లోని ఖలిస్తానీ ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చారంటూ విశ్వాస్ బాంబు పేల్చాడు. ఆ తర్వాత కేజ్రీవాల్ అవన్నీ అబద్దాలేనంటూ ఆరోపించారు.
కానీ అన్ని వైపుల నుంచి ఇప్పుడు ఢిల్లీ సీఎం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే సమయంలో కుమార్ విశ్వాస్ చేసిన ఆరోపణలపై వెంటనే దర్యాప్తునకు ఆదేశించాలని డిమాండ్ చేశారు పంజాబ్ సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ.
మరో వైపు వెంటనే సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత అరవింద్ కేజ్రీవాల్ ను ప్రశ్నించారు ప్రియాంక గాంధీ. రాబోయే రోజుల్లో ఎన్ఐఏ తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తుందని ఓ ఆఫీసర్ చెప్పాడంటూ అరవింద్ కేజ్రీవాల్ చెప్పడం ప్రస్తుతం కలకలం రేపింది.
Also Read : సమిష్టిగా సవాళ్లను ఎదుర్కోవాలి