Kumar Vishwas : ఖలిస్తాన్ ఉద్యమానికి ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మద్దతు ఇస్తున్నారంటూ బాంబు పేల్చిన ఆప్ మాజీ నేత కుమార్ విశ్వాస్(Kumar Vishwas) మరోసారి తీవ్రంగా మండిపడ్డారు.
ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. తాను చేసిన ఆరోపణలను ఎందుకు ఖండించడం లేదని నిలదీశారు. ఖలిస్తాన్ కి వ్యతిరేకమని ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు.
గత ఎన్నికల ముందు తీవ్రవాద సంస్థల సానుభూతి పరులు మీవద్దకు వచ్చారా లేదా అన్నది సమాధానం చెప్పాలని కుమార్ విశ్వాస్(Kumar Vishwas) డిమాండ్ చేశారు. పంజాబ్ లో రెండు రోజులలో ఎన్నికలు జరగనున్న సమయంలో విశ్వాస్ చేసిన కామెంట్స్ కలకలం రేపాయి.
అరవింద్ కేజ్రీవాల్ కు రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. మొదటిది ఆత్మ విశ్వాసంతో అబద్దాలు చెప్పడం, రెండోది తనపై అంతా గ్యాంగ్ అవుతున్నారంటూ బాధితుల కార్డును ప్లే చేస్తాడని ఆరోపించారు.
ఈ రెండు ట్రిక్స్ ప్లే చేస్తూ ఒకసారి దేశాన్ని మరోసారి తన వెంట ఉన్న సహాయకులను మోసం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు కుమార్ విశ్వాస్. ఆప్ పార్టీ పరంగా పంజాబ్ సమావేశాలు జరుగుతున్న సమయంలో తనను రాకుండా అడ్డుకున్నారంటూ మండిపడ్డారు.
అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోదీని, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని ఒకే గాటిన కడుతూ లబ్ది పొందాలని చూస్తున్నాడు. కానీ ఆయన ఈ దేశానికి ప్రథమ శత్రువు అంటూ ఫైర్ అయ్యారు కుమార్ విశ్వాస్.
అయితే ఆధారాలు ఉంటే తనను అరెస్ట్ చేయకుండా ఎందుకు ఉన్నారంటూ ప్రశ్నించారు కేజ్రీవాల్.
Also Read : పవర్ లోకి వస్తాం నేరస్థుల తాట తీస్తాం