Kerala CM Governor : గవర్నర్ ఖాన్ కు సీఎం విజయన్ షాక్
సాగనంపేందుకు అసెంబ్లీలో తీర్మానం
Kerala CM Governor : కేరళలో ప్రభుత్వానికి గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ మధ్య యుద్దం తారా స్థాయికి చేరింది. ఇప్పటికే గవర్నర్ తన పరిధి దాటి ప్రవర్తిస్తున్నారని, ఆయనకు అంత సీన్ లేదని సంచలన ఆరోపణలు చేశారు రాష్ట్ర సీఎం పినరయ్ విజయన్. ఇదే సమయంలో ఖైరాన్ న్యూస్, మీడియా వన్ న్యూస్ ఛానళ్లను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు గవర్నర్.
దీనిపై పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది. ఆ రెండు ఛానళ్లు ప్రభుత్వానికి అనుకూలంగా తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయంటూ ఆరోపించారు గవర్నర్ ఖాన్. ఈ తరుణంలో ఇటీవల తొమ్మిది యూనివర్శిటీల వైస్ ఛాన్సలర్స్ ను తొలగించక ముందే రాజీనామాలు చేయాలంటూ ఆదేశించారు గవర్నర్ .
దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు. గవర్నర్ జారీ చేసిన ఆదేశాలను సవాల్ చేస్తూ వైస్ ఛాన్సలర్లు కేరళ హైకోర్టును ఆశ్రయించారు. ఈ తరుణంలో ఎవరూ రాజీనామా చేయాల్సిన అవసరం లేదని సీఎం విజయన్ స్పష్టం చేశారు. గవర్నర్ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు.
వీసీలను నియమించే అధికారం ఉంది తప్పా తొలగించే పవర్ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ కు లేదని స్పష్టం చేశారు. తాజాగా గవర్నర్ దూకుడు తగ్గించక పోవడంతో సీఎం(Kerala CM Governor) రంగంలోకి దిగారు. ఈ మేరకు ఆయన తమకు వద్దంటూ కేరళ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెట్టి, సాగనంపాలని నిర్ణయం తీసుకున్నారు.
అంతే కాకుండా పశ్చిమ బెంగాల్ లో దీదీ చేసిన విధంగానే యూనివర్శిటీలకు ఛాన్సలర్ గా ఉన్న గవర్నర్ ను తొలగించేలా ప్లాన్ చేశారు విజయన్.
Also Read : సీఎంలు వర్సెస్ గవర్నర్లు