CPM Protest : ఖాన్ గవర్నర్ కాదు ఆర్ఎస్ఎస్ కార్యకర్త
ఆరిఫ్ మహ్మద్ ఖాన్ పై సీపీఎం ఫైర్
CPM Protest : కేరళలో గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ సీఎం పినయర్ విజయన్ మధ్య నువ్వా నేనా అన్న రీతిలో మాటల యుద్దం కొనసాగుతోంది. తను గవర్నర్ గా కాకుండా రాష్ట్రీయ స్వయం సేవక్ కు కార్యకర్తగా పని చేస్తున్నారంటూ ఆరోపించారు సీఎం. ప్రభుత్వం నియమించిన తొమ్మిది మంది వైస్ ఛాన్స్ లర్లను వెంటనే రాజీనామా చేయాలని ఆదేశించారు గవర్నర్ .
నవంబర్ 3 వరకు డెడ్ లైన్ విధించారు. గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వీసీలు కేరళ హైకోర్టును ఆశ్రయించారు. ఈ దావాపై అత్యవసరంగా సమావేశమై కీలక తీర్పు చెప్పింది కోర్టు. రాజ్యాంగబద్దమైన నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది.
ఇదిలా ఉండగా వీసీలను అపాయింట్ చేసేంత వరకు మాత్రమే గవర్నర్ కు అధికారం ఉంటుందని కానీ తీసి వేసేందుకు ఉండదని స్పష్టం చేశారు సీఎం విజయన్. ఒక వేళ అలా చేయాలని అనుకుంటే అసెంబ్లీలో తీర్మానం చేయాల్సి ఉంటుందన్నారు.
రాజ్యాంగానికి రక్షకుడిగా ఉండాల్సిన గవర్నర్ ఖాన్ ప్రభుత్వానికి శత్రువులాగా తయారయ్యాడంటూ నిప్పులు చెరిగారు. ఆయన గవర్నర్ కాదని ఆర్ఎస్ఎస్ కార్యకర్త అంటూ సంచలన ఆరోపణలు చేశారు కేరళ సీఎం. ఇదే సమయంలో సీపీఎం పార్టీ(CPM Protest) సైతం నిప్పులు చెరిగింది. ఆయన గవర్నర్ లాగా వ్యవహరించడం లేదని ఓ కాషాయ కండువా వేసుకున్న కార్యకర్త అంటూ మండిపడింది.
మొత్తంగా కేరళలో రాజకీయం మరింత వేడెక్కింది. సీపీఎం స్టేట్ సెక్రటరీ వీకే గోవర్దన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు గవర్నర్ తీరుపై.
Also Read : మైనార్టీలు ప్రధాని కాగలరా – శశి థరూర్