Kerala Journalists March : కేరళ గవర్నర్ పై జర్నలిస్టుల కన్నెర్ర
ఆరిఫ్ ఖాన్ నిర్ణయంపై సర్వత్రా ఆగ్రహం
Kerala Journalists March : కేరళ గవర్నర్ ఆరిఫ్ అహ్మద్ ఖాన్ ఖైరాన్ న్యూస్ , మీడియా వన్ న్యూస్ ఛానళ్లపై నిషేధం విధించడంపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతోంది. ఇది పూర్తిగా కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించడం తప్ప మరొకటి కాదన్నారు. ఇదిలా ఉండగా ఆ రెండు ఛానళ్లు తనకు వ్యతిరేకంగా పని చేస్తున్నాయని, తనను బద్నాం చేస్తున్నాయంటూ మండిపడ్డారు.
ఈ రెండు ఛానళ్లను నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై ప్రచురణ, ప్రసార, డిజిటల్ మీడియా సంస్థలన్నీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. రాష్ట్రంలో సీపీఎం సర్కార్ వర్సెస్ గవర్నర్ ఖాన్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఆ రెండు ఛానళ్లు ప్రభుత్వానికి అనుకూలంగా తనకు వ్యతిరేకంగా పని చేస్తున్నాయంటూ మండిపడ్డారు.
గవర్నర్ ఒంటెద్దు పోకడను నిరసిస్తూ గవర్నర్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పాదయాత్ర (Kerala Journalists March) చేపట్టారు. ఖాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇది పూర్తిగా పత్రికా స్వేచ్ఛపై ఉక్కుపాదం మోపితే సహించబోమంటూ హెచ్చరించారు. కేరళ జర్నలిస్టులు గవర్నర్ అనుసరిస్తున్న వైఖరి మంచి పద్దతి కాదంటూ సూచించారు.
గవర్నర్ నిన్న ఒక్కటే జర్నలిస్టులను అవమానించ లేదని గతంలో కూడా ఆయన పలుమార్లు ఇబ్బందులకు గురి చేసేలా మాట్లాడారంటూ కేరళ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆరోపించింది. ఒక కిలోమీటర్ మేర పాదయాత్ర చేపట్టింది. బీజేపీ ఆదేశాల మేరకు ఆయన పని చేస్తున్నారని గవర్నర్ గా పని చేయడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.
ఇటీవల 9 మంది వీసీలను రాజీనామా చేయాలని కోరడం వివాదానికి దారి తీసింది.
Also Read : సతీష్ జార్కి హోళి కామెంట్స్ కలకలం