PC George : మత పరమైన కామెంట్స్ చేశారంటూ కేరళ కాంగ్రెస సీనియర్ నాయకుడు పీసీ జార్జ్(PC George) ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేరళ లోని ముస్లిమేతరులు కమ్యూనిటీ నిర్వహించే రెస్లారెంట్లు, హోటళ్లకు దూరంగా ఉండాలని కాంగ్రెస్ మాజీ రాజకీయ నాయకుడు పీసీ జార్జ్ వివాదానికి తెర లేపారు.
ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రధానంగా ముస్లింలను ఆయన టార్గెట్ చేయడం, వారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది.
దీంతో ఆదివారం పోలీసులు జార్జ్ ను అరెస్ట్ చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తెల్ల వారు జామున కొట్టాయం జిల్లాలోని ఎరట్టుపేటలో ఉంటున్న ఆయనను నివాసం నుంచి అదుపులోకి తీసుకున్నారు.
ఫోర్డ్ పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులు వెళ్లారని సమాచారం. కేరళ రాష్ట్ర రాజధానిలో జరిగిన ఒక కాన్ క్లేవ్ లో పీసీ జార్జ్(PC George) చేసిన ప్రసంగం మత విద్వేషాన్ని పెంచిందని ఆరోపిస్తూ ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
రాష్ట్ర పోలీస్ చీఫ్ అనిల్ కాంత్ ఆదేశాల మేరకు మాజీ ఎమ్మెల్యేపై ఫోర్డ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. భారతీయ శిక్షా స్మృతి లోని సెక్షన్ 153-ఏ ( వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం ) కింద కేసు నమోదు చేశారు.
మిస్టర్ జార్జ్ ను తిరువనంతపురం కు తీసుకు వస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అనంత పురి హిందూ మహా సమ్మేళనంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రోగ్రాంలో ఆయన పాల్గొన్ని ప్రసంగించారు. ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read : కేంద్ర సర్కార్ పై బీజేపీ ఎంపీ కన్నెర్ర