Keshav Maharaj : మహరాజ్ ప్లేయర్ ఆఫ్ ది మంత్
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ డిక్లేర్
Keshav Maharaj : ఎప్పటి లాగే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఏప్రిల్ నెలకు గాను ప్లేయర్ ఆఫ్ ది మంత్ ప్రకటించింది.
మెన్స్ క్రికెట్ విభాగంలో సఫారీ టీంకు చెందిన స్పిన్నర్ కేశవ్ మహరాజ్ ను ఎంపిక చేసినట్లు సోమవారం వెల్లడించింది.
స్వదేశంలో జరిగిన రెండు మ్యాచ్ ల టెస్టు సీరీస్ లో కేశవ్ మహరాజ్(Keshav Maharaj) అద్భుతంగా ఆడారు. ఈ రెండు మ్యాచ్ లలో కేశవ్ మహరాజ్ ఏకంగా 16 వికెట్లు తీసి సత్తా చాటాడు.
ఈ రెండు మ్యాచ్ లలో కీలక పాత్ర పోషించాడు. ఇందుకు సంబంధించి ప్లేయర్ ఆఫ్ ది సీరీస్ కు కూడా ఎంపికయ్యాడు. ఇదే సీరీస్ లో మరో స్టార్ ప్లేయర్ సిమోన్ ఆరు వికెట్లు తీశాడు.
సత్తా చాటాడు. అభిమానుల ఆదరాభిమానాలు పొందాడు. ఈసారి కూడా ప్లేయర్ ఆఫ్ ది మంత్ కు కూడా నామినేట్ కావడం విశేషం. వీరితో పాటు ఓమన్ ఓపెనర్ జితిందర్ సింగ్ ను పరిశీలించారు.
కేశవ మహరాజ్(Keshav Maharaj) వీరందరినీ దాటుకుని ప్లేయర్ ఆఫ్ ది మంత్ కు ఎంపికయ్యాడు. ప్రోటీస్ మాజీ బ్యాటర్ , ఐసీసీ ఓటింగ్ ప్యానెల్ మెంబర్ జేపీ డుమిని కేశవ్ మహరాజ్ పై ప్రశంసలు కురిపించాడు.
కేశవ్ మహరాజ్ పూర్తి పేరు కేశవ్ ఆత్మానంద మహారాజ్(Keshav Maharaj). 7 ఫిబ్రవరి 1990లో సౌతాఫ్రికా లోని డర్బన్ లో పుట్టాడు. వయస్సు 32 ఏళ్లు. 2016 నుంచి దక్షిణాఫ్రికాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
3 నవంబర్ 2016లో ఆసిస్ తో టెస్టు అరంగేట్రం చేశాడు. 27 మే 2017లో ఇంగ్లాండ్ తో వన్డే లో ఆడాడు. టీ20లో 6 నవంబర్ 2021లో ఇంగ్లాండ్ లో ఎంట్రీ ఇచ్చాడు.
Also Read : భారత్ లో ఐపీఎల్ ఆట కాదు ఓ మతం