Kesineni Swetha: కేశినేని శ్వేత రాజీనామా ఆమోదం !

కేశినేని శ్వేత రాజీనామా ఆమోదం !

Kesineni Swetha: విజయవాడ ఎంపీ కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత రాజీనామాకు ఆమోదం లభించింది. ఈ నెల 8వ తేదీన కేశినేని శ్వేత… తన కార్పోరేటర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మిని కలిసి తన రాజీనామా లేఖను అందజేసారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నానని… తన రాజీనామా ఆమోదించాలని కేశినేని శ్వేత కోరారు. అయితే దాదాపు రెండు వారాల తర్వాత కేశినేని శ్వేత రాజీనామాను మేయర్ భాగ్యలక్ష్మి మంగళవారం ఆమోదించారు. దీనితో విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ లో 11వ డివిజన్ ఖాళీ ఏర్పడింది. ఎన్నికల కమీషన్ నిబంధనలు ప్రకారం ఆరు నెలల్లో 11వ డివిజన్ కార్పోరేటర్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. అయితే టీడీపీ ప్రాధమిక సభ్యత్వానికి, తన కార్పోరేటర్ పదవికి రాజీనామా చేసిన కేశినేని శ్వేత… ఆమె తండ్రి విజయవాడ ఎంపీ కేశినేని నాని త్వరలో వైసీపీలో చేరి… మరల జరగబోయే ఉప ఎన్నికల్లో పాల్గొనే అవకాశం కనిపిస్తోంది.

Kesineni Swetha Resign

విజయవాడ ఎంపీ కేశినేని నాని టీడీపీ ప్రాధమిక సభ్యత్వానికి, ఎంపీ పదవికి కొద్ది రోజుల క్రితం రాజీనామా చేసారు. ఎంపీగా రాజీనామా చేసిన కొన్ని గంటల్లోనే వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిసారు. తన రాజీనామా ఆమోదం పొందిన తరువాత వైసీపీలో చేరనున్నట్లు ప్రకటించారు. అంతేకాదు తన బాటలోనే తన కుమార్తె శ్వేత కూడా నడుస్తుందని ప్రకటించారు. దీనితో కేశినేని శ్వేత(Kesineni Swetha) కూడా టీడీపీ ప్రాధమిక సభ్యత్వానికి, కార్పోరేటర్ పదవికి రాజీనామా చేసారు. సీఎం జగన్ కు కలిసిన నాటి నుండి ఎంపీ కేశినేని నాని… టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత నారా లోకేష్ పై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. మీడియా, సోషల్ మీడియా వేదికగా కేశినేని నాని చేస్తున్న రచ్చకు… టీడీపీ నాయకులు బోండా ఉమ, బుద్దా వెంకన్న, వర్ల రామయ్య పెద్ద ఎత్తున కౌంటర్లు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో కేశినేని శ్వేత రాజీనామా ఆమోదం పొందడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Also Read : YS Sharmila Letter to Modi: ప్రధాని మోదీకి వైఎస్ షర్మిల లేఖ !

Leave A Reply

Your Email Id will not be published!