Kevin Pietersen : ఐపీఎల్ 2022లో భాగంగా జరిగిన లీగ్ మ్యాచ్ లో ఆర్సీబీ సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఘోరమైన ఓటమిని మూటగట్టుకుంది. ప్రధానంగా హైదరాబాద్ పేసర్ల దెబ్బకు 68 పరుగులకే అంతా చాప చుట్టేశారు.
ఇక ప్రపంచ స్టార్ ప్లేయర్, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పరిస్థితి దారుణంగా ఉంది. వరుసగా డకౌట్ కావడం ఇది రెండోసారి. మార్కో జాన్సెన్ బౌలింగ్ దెబ్బకు డకౌట్ గా వెను దిరిగాడు.
దీంతో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ , క్రికెట్ కామెంటేటర్ కెవిన్ పీటర్సన్(Kevin Pietersen) సంచలన కామెంట్స్ చేశాడు విరాట్ కోహ్లీపై . కోహ్లీ ఇలాగే ఆడుతూ పోతే తన కెరీర్ లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, ఇక ఆడకుండా ఉండడమే మేలని సూచించాడు.
ఇప్పటికైనా ఫామ్ లోకి రావాల్సిన అవసరం ఉందన్నాడు పీటర్సన్. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు ఐపీఎల్ లో 8 మ్యాచ్ లు ఆడింది ఆర్సీబీ. ఈ మ్యాచ్ లన్నంటిలోనూ విరాట్ కోహ్లీ చేసిన పరుగులు పట్టుమని 119 మాత్రమే కావడం గమనార్హం.
ఇదే సమయంలో ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్ కప్ జరగనుంది. ఈ తరుణంలో ఇలాగే తన ఫామ్ ను కంటిన్యూ చేస్తూ పోతే అతడి ప్లేస్ ప్రశ్నార్థకంగా మారడం ఖాయమని హెచ్చరించాడు.
ఇప్పటికైనా ఫామ్ లోకి వచ్చేందుకు కోహ్లీ ప్రయత్నం చేయాలని లేక పోతే జట్టులో ఉండడం కష్టమవుతుందని సూచించాడు కెవిన్ పీటర్సన్. పూర్తిగా పేలవమైన ప్రదర్శనతో ఇబ్బందులు పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
Also Read : పంత్ తీరుపై అజహరుద్దీన్ ఫైర్