Sidhu Moosewala Case : సిద్దూ కేసులో కీల‌క నిందితుడు అరెస్ట్

అజ‌ర్ బైజాన్ లో ప‌ట్టుకున్నామ‌న్న పోలీస్

Sidhu Moosewala Case : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది ప్రముఖ పంజాబ్ పాప్ గాయ‌కుడు, కాంగ్రెస్ నేత సిద్దూ మూసేవాలా(Sidhu Moosewala Case) హ‌త్య కేసు. ఈ కేసులో ఇప్ప‌టికే కొంద‌రు నిందితుల‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

తాజాగా సిద్దూ కేసులో కీల‌క నిందితుడిని అజ‌ర్ బైజాన్ లో అరెస్ట్ చేసిన‌ట్లు పంజాబ్ పోలీసులు చెప్పారు. సిద్దూ మూసేవాలా హ‌త్య‌కు బాధ్య‌త వ‌హిస్తున్న గ్యాంగ్ స్ట‌ర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ లోని మ‌రో స‌భ్యుడు గోల్డీ బ్రార్ తో స‌చిన్ థాప‌న్ కాల్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాడు.

ఇదిలా ఉండ‌గా ఈ ఏడాది మే 29న సిద్దూ పంజాబ్ లోని మాన్సా జిల్లాలో హ‌త్య‌కు గుర‌య్యాడు. ఈ కేసుకు సంబంధించి కీల‌క‌మైన పురోగ‌తిగా భావించవ‌చ్చు.

ఇటీవ‌లే సిద్దూ పేరెంట్స్ కీల‌క నిందితుల‌ను ప‌ట్టుకోవ‌డంలో నిర్ల‌క్ష్యం వ‌హిస్తున్నారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. తాము ఆందోళ‌న చేప‌డ‌తామ‌ని హెచ్చ‌రించింది.

కేంద్ర ప్ర‌భుత్వ స‌హాయంతో అజ‌ర్ బైజాన్ లో దాక్కున్న కీల‌క నిందితుడిగా భావిస్తున్న థాప‌న్ ను గుర్తించి అదుపులోకి తీసుకున్న‌ట్లు వెల్ల‌డించారు. లారెన్స్ , గోల్డీ బ్రార్ , థాప‌స్ ఒక‌రినొక‌రు ఫోన్ లో మాట్లాడుకుంటూ వ‌చ్చార‌ని తెలిపారు పంజాబ్ పోలీసులు.

సిద్దూ కుటుంబానికి న్యాయం చేసేందుకు మా ఉమ్మ‌డి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని స్ప‌ష్టం చేశారు డీజీపీ పంజాబ్ గౌర‌వ్ యాద‌వ్.

మూసే వాలా హ‌త్య‌కు ముందు లారెన్స్ సోద‌రుడు థాప‌న్ , మ‌రో నిందితుడు అన్మోల్ న‌కిలీ పాస్ పోర్ట్ ను ఉప‌యోగించి దేశం విడిచి పారి పోయార‌ని తెలిపారు.

Also Read : రేప్ కేసుల్లో రాజ‌స్థాన్..ఎంపీ..యూపీ టాప్

Leave A Reply

Your Email Id will not be published!