Modi : భారత్, ఆస్ట్రేలియా దేశాల మధ్య కీలకమైన వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇరు దేశాల మధ్య మరింత బంధం బలపడేందుకు దోహదం చేసింది.
ఈ సందర్బంగా ఇదొక అద్వితీయమైన ముందడుగుగా పేర్కొన్నారు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Modi). ఆస్ట్రేలియాకు చెందిన ప్రధాన మంత్రి స్కాట్ మారిసన్ తో ప్రధాని మోదీ భేటీ కావడంతో ఇది మూడో సారి కావడం విశేషం.
ఇదిలా ఉండగా ఆర్థిక బంధాన్ని పెంపొందించేందుకు భారత్ , ఆస్ట్రేలియా మధ్య శనివారం కీలక వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఇంత తక్కువ వ్యవధిలో ఇంత ముఖ్యమైన ఒప్పందం పై ఏకాభిప్రాయం రెండు దేశాల మధ్య పరస్పర విశ్వాసాన్ని చూపుతుందని పేర్కొన్నారు ప్రధాని మోదీ(Modi).
ఇది ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్టం చేస్తుందని స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య బంధం మరింత బలపడాలని ఆశిస్తున్నట్లు మోదీ తెలిపారు.
ఈ సందర్భంగా ఆస్ట్రేలియా ప్రధాని మోరిసన్ మాట్లాడారు. తాము సమగ్ర, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించనప్పటి నుంచి సహకారం అత్యంత విశేషమైనదిగా భావిస్తున్నట్లు తెలిపారు.
282 మిలియన్ల విలువ కలిగిన కొత్త కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలిపారు. వాణిజ్య ఒప్పందానికి ముందు ప్రధాని మోరిసన్ ఇవాళ ప్రపంచంలో తెరవబోయే అతి పెద్ద వాణిజ్య, ఆర్థిక ఒప్పందంలో ఒకటిగా పేర్కొన్నారు.
భారత దేశానికి 85 శాతం కంటే ఎక్కువ ఆస్ట్రేలియాకు చెందిన వస్తువుల ఎగుమతులపై సుంకాలు తొలగించబడ్డాయి. గొర్రెల మాంసం, ఉన్ని, రాగి, బొగ్గు, అల్యూమినియం తదితర వాటిపై రద్దు చేశారు.
అంతే కాదు 96 శాతం భారత్ కు చెందిన వస్తువుల దిగుమతులు సుంకం లేకుండా ఆస్ట్రేలియాలోకి ప్రవేశిస్తాయి. ప్రధానులు ఇద్దరూ వర్చువల్ గా సమావేశం అయ్యారు.
Also Read : మళ్లీ పెరిగిన పెట్రోల్..డీజిల్ ధరలు