Sonia Gandhi : తాజా రాజకీయ పరిస్థితులతో పాటు ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమిపై ప్రధానంగా ప్రత్యేకించి చర్చించనుంది కాంగ్రెస్ పార్టీ (Congress Party).
ఈనెల 26న రాజధానిలో పార్టీకి చెందిన ప్రధాన కార్యదర్శులు , ఆయా రాష్ట్రాల ఇన్ చార్జ్ లతో ఏఐసీసీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ (Sonia Gandhi )సమావేశం కానున్నారు. ఈ కీలక సమావేశానికి పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాలు అధ్యక్షత వహించనున్నారు.
ఈ సందర్భంగా మేడం సోనియా హాజరవుతారు. ఇటీవల దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ (Congress Party) సభ్యత్వ నమోదు కార్యక్రమంతో పాటు కేంద్ర సర్కార్, బీజేపీకి వ్యతిరేకంగా ఎలాంటి కార్యక్రమాలు, ఆందోళనలు చేపట్టాలనే దానిపై చర్చిస్తారు.
ఇప్పటికే పార్టీలో అసమ్మతి స్వరం వినిపిస్తూ వస్తున్న జీ23 నేతలతో కూడా సోనియా గాంధీ(Sonia Gandhi )ములాఖత్ అయ్యారు. వారు సూచించిన సూచనలను పరిగణలోకి తీసుకున్నారు.
పార్టీ నిర్మాణంలో మార్పు లు చేపట్టాలంటే కొంత సమయం పడుతుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇందులో భాగంగా సంస్థాగత ఎన్నికల దాకా వేచి చూడాలని సూచించారు సోనియా గాంధీ.
ఇదిలా ఉండగా వచ్చే ఏడాదిలో హిమాచల్ ప్రదేశ్ , రాజస్థాన్ లలో ఎన్నికలు జరగనున్నాయి. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సీనియర్ నాయకులతో మేడం భేటీ అయ్యారు.
పంజాబ్ రాష్ట్రంలో చోటు చేసుకున్న అనిశ్చితి, ఆధిపత్య పోరుతో పార్టీకి తీవ్ర డ్యామేజ్ ఏర్పడిందని అలా కాకుండా అంతా సమిష్టిగా పార్టీ కోసం పని చేయాలని సూచించారు సోనియా గాంధీ.
అంతే కాకుండా విజయం సాధించేలా కృషి చేయాలని మేడం కోరారు.
Also Read : చైనా కామెంట్స్ ఇండియా సీరియస్