Elon Musk Update : ట్విట్టర్ లో కీలక అప్ డేట్ – ఎలోన్ మస్క్
ట్వీట్ల విషయంలో సంచలన నిర్ణయం
Elon Musk Update : టెస్లా సిఇఓ, చైర్మన్ , ట్విట్టర్ బాస్ ఎలోన్ మస్క్ కీలక ప్రకటన చేశాడు. రోజు రోజుకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారేమోనన్న ఆందోళన ఉద్యోగులలో నెలకొంది. ఇప్పటికే సంచలన నిర్ణయాలు తీసుకుంటూ బెంబేలెత్తిస్తున్నాడు. చాలా ఆఫీసులను మూసి వేశాడు. మరికొన్నింటిలో ఉన్న వస్తువులను వేలానికి పెట్టాడు.
ఇటీవల శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న ట్విట్టర్ ఆఫీసులోని లోగోను విక్రయించాడు. కాస్ట్ కటింగ్ పేరుతో 9 వేల మందిని సాగనంపాడు. ట్విట్టర్ అనేది ఉంటుందా లేక పూర్తిగా మూసి వేస్తాడా అన్న అనుమానం అంతటా నెలకొంది. కోట్లాది మంది నిత్యం ఫాలో అయ్యే ఏకైక మైక్రో బ్లాగింగ్ సంస్థ ట్విట్టర్. దీనిని ఇటీవల ఎలోన్ మస్క్ రూ. 4,400 కోట్లకు కొనుగోలు చేశాడు.
ఆ తర్వాత టాప్ ఎగ్జిక్యూటీవ్ లను తొలగించాడు. అక్కడి నుంచి నేటి దాకా మార్పులు చేస్తూ ఉద్యోగులను తొలగిస్తూ నానా హంగామా చేస్తున్నాడు ఎలోన్ మస్క్. తాజాగా మరో కీలక ప్రకటన చేశాడు. ట్విట్టర్ లో నవీకరణ గురించి తెలిపాడు. తదుపరి అప్ డేట్ యూజర్లకు సంబంధించి అనుకూల సెట్టింగ్ ల నుండి సిఫార్సు చేసిన ట్వీట్ లను మార్చి వేయడాన్ని నిలిపి వేస్తున్నట్లు తెలిపారు ఎలోన్ మస్క్(Elon Musk Update).
ఇతర దేశాలు, సంస్కృతుల నుండి ట్వీట్లను అనువదించడం, సిఫార్సు చేయడం ట్విట్టర్ చేస్తుందని తెలిపాడు. ఇదిలా ఉండగా వచ్చే నెల ఫిబ్రవరిలో లాంగ్ ఫార్మ్ ట్వీట్ ఫీచర్ ను ప్రారంభించనున్నట్లు ధ్రువీకరించాడు బాస్ ఎలోన్ మస్క్.
Also Read : అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఖుష్ కబర్