Ujwal Kulkarni : భారతీయ సినిమాను షేక్ చేస్తోంది ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న కేజీఎఫ్ -2 మూవీ. యశ్ తో పాటు శ్రీనిధి, రవీనా టాండన్ , సంజయ్ దత్ నటించిన ఈ చిత్రం దుమ్ము రేపుతోంది.
ఇప్పటికే రికార్డుల మోత మోగిస్తోంది. ఇప్పటికే పాన్ ఇండియా మూవీగా విడుదలైన ఈ చిత్రం సిత్రాలు చేస్తోంది. బాలీవుడ్ లోనే రూ. 50 కోట్లకు పైగా వసూలు చేసింది.
ఇంకా మున్మందు ఇంకెన్ని రికార్డులు బద్దలు కొట్టనుందో వేచి చూడాలి. చిత్రీకరణలో సూపర్ అంటున్నారు క్రిటిక్స్ . ఇక సినిమా టేకింగ్ కు వంద మార్కులు వేయొచ్చంటున్నారు వివాదాస్పద దిగ్గజ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.
చిత్ర విజయంలో ఎడిటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే కేజీఎఫ్ -2 ను అద్భుతంగా మలిచింది. ఆకట్టుకునేలా చేసింది. మాత్రం కేవలం 19 ఏళ్ల వయసున్న కుర్రాడు ఉజ్వల్ కుల్ కర్ణి(Ujwal Kulkarni).
కోట్లాది రూపాయలు ఖర్చు చేసి చిత్రాన్ని తీసిన దర్శకుడు ప్రశాంత్ నీల్ నమ్మకాన్ని నిలబెట్టాడు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి మనోడిపై.
ప్రతిఫ్రేమ్ ను ఆకట్టుకునేలా, అద్భుతంగా మలిచేలా ఎడిటింగ్ చేసిన ఘనత కుల్ కర్ణిదేనని చెప్పక తప్పదు. ఎంతో అనుభవం ఉన్న వాళ్లు సైతం ఆశ్చర్య పోయేలా, విస్మయానికి గురి చేసేలా చేశాడు ఈ కుర్రాడు.
అతడి పనితీరుకు నచ్చిన నీల్ బిగ్ ప్రాజెక్టును తన చేతిలో పెట్టాడు. ప్రస్తుతం మోస్ట్ పాపులర్ అయి పోయాడు ఈ ఒక్క మూవీతో.
ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే ఈ ఉజ్వల్ మనస్తత్వాన్ని మనం అభినందించకుండా ఉండలేం. ఏది ఏమైనా టాలెంట్ అన్నది ఏ ఒక్కడి సొత్తు కాదన్నది మరోసారి ప్రూవ్ అయ్యింది. జీతే రహో ఉజ్వల్ భాయ్.
Also Read : ఢిల్లీ ఫైల్స్ పేరుతో మూవీ – డైరెక్టర్