KGF2 Toofan Song : కేజీఎఫ్‌-2 తూఫాన్ లిరిక‌ల్ సాంగ్ రిలీజ్

క‌న్న‌డ స్టార్ య‌శ్ పై భారీ అంచ‌నా

KGF2 Toofan Song  : జిల్ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన కేజీఎఫ్ దుమ్ము రేపింది. పాన్ ఇండియాలో క‌లెక్ష‌న్ల సునామీ సృష్టించింది. ఎలాంటి అంచ‌నాలు లేకుండానే విడుద‌లైన ఆ మూవీ దుమ్ము రేపింది.

భార‌తీయ సినిమా ను షేక్ చేసింది. దీంతో ఎవ‌రీ ద‌ర్శ‌కుడు అంటూ ప్ర‌శాంత్ నీల్ పై యావ‌త్ సినీ లోకం ఫోక‌స్ పెట్టింది. గ‌తంలో ఎన్నో సినిమాల్లో న‌టించినా రాని పేరు ఒకే ఒక్క మూవీతో పాన్ ఇండియా హీరోగా మారి పోయాడు క‌న్న‌డ స్టార్ య‌శ్.

అన్ని భాష‌ల్లో విడుద‌లైన ఈ చిత్రం కోట్లు కొల్ల‌గొట్టింది. దీంతో కేజీఎఫ్ మూవీకి సీక్వెల్ గా ప్ర‌శాంత్ నీల్ కేజీఎఫ్ -2 తీశాడు. య‌శ్ హీరోగా వ‌స్తున్న ఈ చిత్రం పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

ఇప్ప‌టికే విడుద‌ల చేసిన పోస్ట‌ర్లు, ట్రైల‌ర్ కేక పెట్టించేలా ఉంది. మ‌రోసారి బాక్సులు బ‌ద్ద‌లు కొట్ట‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు సినీ వ‌ర్గాలు. ప్రేక్ష‌కుల్లో కేజీఎఫ్ 2 పై భారీ అంచ‌నాలు ఉన్నాయి.

ఇదిలా ఉండ‌గా తాజాగా ఈ చిత్రానికి సంబంధించి తూఫాన్ అనే లిరిక‌ల్ సాంగ్ (KGF2 Toofan Song )వీడియోను మూవీ మేక‌ర్స్ విడుద‌ల చేశారు. టాలీవుడ్ లో ప్ర‌ముఖ ర‌చ‌యిత గా పేరొందిన రామ జోగ‌య్య శాస్త్రి ఈ తూపాన్ పాట‌ను రాశారు.

ఇక మూవీలో బాలీవుడ్ న‌టుడు సంజ‌య్ ద‌త్ , ర‌వీనా ఠాండ‌న్ , రావు ర‌మేశ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈ మూవీకి ర‌వి భాస్క‌ర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏప్రిల్ 14న రిలీజ్ చేయ‌నున్నారు.

Also Read : వేగేశ్న సతీష్ ‘కథలు’ వెబ్ సిరీస్ !

Leave A Reply

Your Email Id will not be published!