Punjab Tension : పంజాబ్ లో టెన్షన్ టెన్షన్
ఛేజింగ్ చేసి సింగ్ పట్టివేత
Punjab Tension : ఉగ్రవాదులు, నేరస్థులు, వ్యతిరేక వాదులు ఎవరైనా సరే ఉపేక్షించే ప్రసక్తి లేదని ఇప్పటికే సీరియస్ వార్నింగ్ ఇచ్చారు పంజాబ్ సీఎం భగవంత్ మాన్. ప్రత్యేక ఖలిస్తాన్ దేశం కావాలంటూ డిమాండ్ చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్న అమృత్ పాల్ సింగ్ ను శనివారం పోలీసులు వెంటపడి పట్టుకున్నారు.
దీంతో మార్చి 19న ఆదివారం సాయంత్రం దాకా ఇంటర్నెట్ సేవలు నిలిపి వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 144 సెక్షన్ విధించారు పోలీసులు. తప్పించు కోవాలని ప్రయత్నం చేస్తున్న అమృత్ పాల్ సింగ్ ను వెంటాడారు. చివరకు ఎట్టకేలకు పట్టుకున్నామని, అమృత్ పాల్ సింగ్ తో పాటు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు డిక్లేర్ చేశారు.
అయితే సింగ్ కు మద్దతుగా పెద్ద ఎత్తున పంజాబీ మద్దతుదారులు ఆందోళనకు దిగారు. ఇదిలా ఉండగా ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని , దీనిపై పంజాబ్ పోలీసులు అధికారిక ప్రకటన చేస్తారని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ వెల్లడించారు. ఇంటర్నెట్ ను నిలిపి వేయడంతో అక్కడం ఏం జరుగుతుందనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.
పంజాబ్ డీ చీఫ్ గా కొనసాగుతున్నాడు అమృత్ పాల్ సింగ్(Punjab Tension). అతడితో పాటు వచ్చిన 10 మంది స్నేహితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. భింద్రన్ వాలే 2.0 గా పిలువబడే 29 ఏళ్ల ఖలిస్తాన్ లీడర్ కు మద్దతుగా నిహాంగ్స్ నిరసన ప్రదర్శన చేపట్టారు. పంజాబ్ ప్రభుత్వం ముందు జాగ్రత్తగా ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా 144 సెక్షన్ విధించింది పోలీస్. నెట్ సేవలు పని చేయడం లేదు. దీంతో ఏం జరుగుతుందో తెలియడం లేదు.
Also Read : ఖలిస్తాన్ లీడర్ అమృత్ పాల్ అరెస్ట్