Khiladi Kiss : కిక్కు ఎక్కిస్తున్న ‘ఖిలాడీ కిస్’

హ‌ద్ద‌లు దాటిన మాస్ మ‌హ‌రాజా

Khiladi Kiss : ఏజ్ దాటినా తాను ఇంకా కుర్రోడినేనంటున్నాడు మాస్ మ‌హ‌రాజా. ర‌వితేజ, మీనాక్షి న‌టించిన ఖిలాడీ ఈనెల 11న రిలీజ్ కాబోతోంది. ఇప్ప‌టికే మ‌లినేని గోపీచంద్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది.

తాజాగా కొత్త మూవీ ట్రైల‌ర్ లో ముద్దు సీన్ తో త‌న మార్క్ చూపించాడు ర‌వితేజ యాక్ష‌న్, రొమాంటిక్, థ్రిల్ల‌ర్ క‌థాంశంతో ఖిలాడీ(Khiladi Kiss) తెర‌కెక్కించాడు. ఇక టాలీవుడ్ ఇప్పుడు హాలీవుడ్ ను త‌ల‌పింప చేస్తోంది.

ఏదో ర‌కంగా రొమాన్స్ ను చొప్పించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు సినీ ద‌ర్శ‌కులు. ఇప్పుడు సినిమా అన్న‌ది వ్యాపారంగా మారింది. విజ‌య్ దేవ‌ర‌కొండ అర్జున్ రెడ్డిలో చేసిన ర‌చ్చ అత‌డిని టాప్ హీరో గా మార్చేసింది.

ఇలాంటివి తీసి స‌మాజానికి ఏం మెస్సేజ్ చెప్పాల‌ని అనుకుంటున్నారో స్ప‌ష్టం చేయాల‌ని నిల‌దీస్తున్నారు నెటిజ‌న్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా. ఇక సినిమా ప్ర‌మోష‌న్స్ కూడా మామూలుగా ఉండ‌డం లేదు.

క‌ష్ట‌ప‌డి ఎవ‌రి స‌హ‌కారం లేకుండానే హీరోగా ఎదిగిన ర‌వితేజ హ‌ద్దులు దాట‌డాన్ని త‌ప్పు ప‌డుతున్నారు. ఇదిలా ఉండ‌గా ముద్దు సీన్ లో న‌టించిన హీరోయిన్ మీనాక్షి చౌద‌రి స్పందించింది.

పాత్ర ప‌రంగా రొమాన్స్ చేసేందుకు తాను రెడీగా ఉన్నాన‌ని అంటోంది ఈ ముద్దుగుమ్మ‌. సుశాంత్ హీరోగా న‌టించిన ఇచ్చ‌ట వాహ‌న‌ములు నిలుప‌రాదు అన్న మూవీలో న‌టించింది. లిప్ లాక్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ట్రైల‌ర్ లోనే ఈ రేంజ్ లే ఉంటే ఇక సినిమాలో ఎలా ఉండ‌బోతుందోన‌ని అభిమానులు ఉత్కంఠ‌తో ఎదురు చూస్తున్నారు. డైరెక్ట‌ర్ ముందే చెప్పార‌ని తాను ఒప్పుకున్నాన‌ని తెలిపింది.

Also Read : 7 ఆర్ట్స్ ‘స‌ర‌యు..టీం’ అరెస్ట్

Leave A Reply

Your Email Id will not be published!